Australia win series 3-0

Australia win series 3 0

Australia, India, Team India, Melborne, Australia won series, Kohli, MAxwell, Dhoni

India's bowlers today produced yet another sloppy performance to allow Australia clinch the 5-match ODI series by taking an unassailable 3-0 lead as they cruised to a 3-wicket victory in the third match despite a heroic century by Virat Kohli. Match scorecard; Ind-Aus series schedule; Photo gallery Batting first, India scored a decent 295 for six in 50 overs with Virat Kohli scoring a run-a-ball 117 en route to his 24th ODI century. In reply, Australia never looked in trouble as they knocked off the required runs with 1.1 overs still remaining.

టీమిండియా ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియా సొంతం

Posted: 01/17/2016 07:01 PM IST
Australia win series 3 0

టీమిండియా తీరుమారలేదు.. దాంతో ఆస్ట్రేలియా సిరీస్ ను మరో రెండు మ్యాచులు ఉండగానే కైవసం చేసుకుంది. మొత్తం ఐదు మ్యాచుల సిరీస్ లో ఆస్ట్రేలియా వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. మెల్ బోర్న్ లో ఈ రోజు జరిగిన వన్డే పోటీలో టీమిండియా 50 ఓవర్లలో 295 పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో విజయలక్ష్యమైన 296 పరుగులు సాధించింది. గతంలో జరిగిన రెండు వన్డేల కన్నా ఈ పోటీలో భారతీయ బౌలర్లు మెరుగైన ప్రతిభ ప్రదర్శించినా కానీ అపజయం టీమిండియాను వెంటాడింది. మాక్స్ వెల్ జట్టులో కీలకపాత్రవహించి చేసిన 96 పరుగులతో ఆస్ట్రేలియాకు విజయం లభించింది.

ఆస్ట్రేలియా ఓపెనర్లు ఎస్ మార్ష్ 62, ఫించ్ 21 కెప్టెన్ స్మిత్ 41 బెయిలీ23, మాక్స్ వెల్ 96, మిచెల్ మార్ష్ 17, వైడ్ 6, ఫాల్క్ నర్ 21 ( నాట్ ఔట్) చేశారు. భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్ , ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. భారత జట్టులో రిషి ధావన్, గురుకీరత్ మాన్ తొలి వన్డే ఆడినా పెద్దగా ప్రతిభచూపలేకపోయారు. భారత బ్యాట్స్ మన్ లో శిఖర్ ధావన్ 68, పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ 117 పరుగులు చేశాడు. వన్డేల్లో 24వ సెంచరీ చేశాడు. అతి తక్కువ సమయంలో వన్డేల్లో 7 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడుగా రికార్డులకు ఎక్కాడు. అజంక్యా రహానే 50 పరుగులు, ధోని 23 పరుగులు చేసినా మిగతా బ్యాట్స్ మన్ రాణించలేదు. ఏమైనా ఆస్ట్రేలియా సీరీన్ ను 3-0తో నెగ్గింది. ఈ మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  India  Team India  Melborne  Australia won series  Kohli  MAxwell  Dhoni  

Other Articles