india-under-19-captain-ishan-kishan-arrested-ahead-of-world-cup

Under 19 cricket captain ishan kishan arrested for rash driving

Neeraj Singh, Bangladesh, Ishan Kishan, India Under-19 team, ICC Under-19 World Cup, reckless driving, Patna Police, Cricket, Kankarbagh police station, Vijay Kumar Mishra, Pranab Pandey,, India Under-19 cricket captain, arrest, Ishan Kishan arrested, India junior cricket team, Junior Cricket World Cup

India’s under-19 cricket captain Ishan Kishan was briefly held in Patna for rash driving, police said on Wednesday, just days before the junior World Cup kicks off in Bangladesh.

రాష్ డ్రైవింగ్ కేసులో క్రికెట్ కెప్టెన్ అరెస్ట్

Posted: 01/13/2016 06:41 PM IST
Under 19 cricket captain ishan kishan arrested for rash driving

ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందం, ఉత్సహాంతో.. ఈ నెల (జనవరి) 20 నుంచి ప్రారంభం కానున్న అండర్-19 ప్రపంచ కప్ లోనూ అధిపత్యం ప్రదర్శించి.. కప్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న టీమిండియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. నిర్లక్ష్యంగా కారును నడిపి ఆటోను ఢీకొట్టిన కేసులో భారత్ అండర్-19 జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ను పట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కిషన్ వేగంగా కారును నడుపుతూ ఆటోను ఢీకొట్టడంతో అందులోని ప్రయాణికులు గాయపడ్డారు. అంతేగాక ప్రమాద స్థలంలో కిషన్ ఘర్షణకు దిగాడు. దీంతో స్థానికులు కిషన్ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు కిషన్ను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు. బిహార్లోని నవడా జిల్లాకు చెందిన కిషన్.. జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అండర్ 19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కిషన్ అటు వికెట్ కీపర్ గానూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. దేశవాళీ పోటీల్లో అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీలో పది మ్యాచ్ల్లో 736 పరుగులు చేశాడు. దీంతో గత డిసెంబర్లో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ నెల 27న బంగ్లాదేశ్లో అండర్-19 ప్రపంచ కప్ ఆరంభకానుంది. ఈ తరుణంలో కిషన్ అరెస్ట్ కావడంతో భారత జట్టుకు ప్రతికూలంగా మారింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India U-19 cricket captain  Ishan Kishan  reckless driving  arrest  

Other Articles