Watch: MS Dhoni dances in a 'dhoti' with Prabhu Deva

Dhoni shakes a leg with prabhu deva in a dhoti

ms dhoni, dhoni, dhoni dance, ms dhoni dance, dhoni lungi dance, lungi, lungi dance, dhoni prabu deva, prabhu deva dance, MS Dhoni Dance with Prabhu Deva, tv advt, dhoni prabhudeva advertisement, msd prabhu deva tvs byke advt

Captain Cool once again justifies the popular moniker his fans have given him. Done for TVS Star City plus, the Telugu advert stars him and actor Prabhudeva.

ప్రభుదేవాతో లుంగి డాన్స్ ఇరగదీసిన ధోని

Posted: 01/13/2016 07:38 PM IST
Dhoni shakes a leg with prabhu deva in a dhoti

టిమిండియా వన్డే సహా పోట్టి ఫార్మెట్ టీ-20 కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ సకల కళా వల్లభుడంటూ ఈ మధ్య అతని అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడటంలో ఆయనది ఒక ప్రత్యేకమైన ధనాధన్‌ శైలి. హెలికాప్టర్ షాట్లతో మైదానంలో రెచ్చిపోవడంతో పాటు నెమ్మెదిగా స్కోరుబోర్డును పరుగులెత్తించడమూ, ప్రత్యర్థుల పరుగులకు కళ్లెం వేయడమూ తెలిసిన మేథావని మనకు తెలుసు. అయితే మరి అయన అబిమానులు ఎందుకిలా సంతోషపడుతున్నారు..? అదేగా మీ సందేహం.

కెప్టెన్ ధోని క్రికెట్ లో రాణించడమే కాదు.. అటు డాన్సులలోనూ ప్రతిభ కనబర్చి ప్రముఖ కోరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవాతో పాటుగా డాన్స్ చేయగలడని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. ఎందుకంటే ఇటీవల ధోని ప్రభుదేవాతో ఫోటీ పడి మరీ డాన్స్ చేయడమే ఇందుకు కారణం. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక.. వ్యాపారాలు చూసుకుంటూ జీవితాన్ని గడపాల్సిన అవసరం తమ క్రికెటర్ కు లేదని, ఆయన సినిమాలలోనూ రాణించి మంచి పేరు సంపాదించగలరని వారంటున్నారు. తాజాగా ధోని ఓ మోటార్‌ బైక్ వాణిజ్య ప్రకటన కోసం దక్షిణ భారతీయులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా చేసిన యాడ్ నెట్టింట్లో సంచలనం రేపడంతో దోని అభిమానులు చిందులు వేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  prabhu deva  lungi dance  advertisement  

Other Articles