Team India lost the first ODI with Australia

Team india lost the first odi with australia

cricket, ODI, Team India, Australia, India Vs Australia, India lost the match, Dhoni, Kohli, Rohit Sharma, Steven Smith, Bailey

If this is summer's main course, then Steven Smith and George Bailey wasted no time at all tucking in. A batsmen's battle unfolded between Australia and India at the WACA, with the hosts seeing a 207-run stand between Rohit Sharma and Virat Kohli before raising it through the match-defining union between Smith and Bailey, worth 242.

ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి

Posted: 01/12/2016 06:02 PM IST
Team india lost the first odi with australia

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. ఆరంభంలో బాగా దూసుకెళ్లినా.. భారీ లక్ష్యాన్నే నిర్దేశించినా కానీ టీమిండియా ఓటమి నుండి తప్పించుకోలేపోయింది. టీమిండియా బ్యాట్స్ మాన్ లు వీర విహారం చేసినా కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లను కట్టడి చెయ్యడంలో మన బౌలర్లు విషలమయ్యారు. దాంతో మన వాళ్లు చిరవకు ఓటమిపాలుకాక తప్పలేదు. ముందు నుండి బలంగా ఉన్న బ్యాటింగ్ లో సత్తా చూపించినా కానీ బౌలింగ్ లో ఎదుటి టీంను కట్టడి చెయ్యడంలో విఫలం కావడంతో టీమిండియా మొదటి వన్డే మ్యాచ్ లో ఓటమిని చవిచూసింది. రోహిత్ శర్మ కష్టపడి 171 పరుగులు చేసినా కానీ లాభం లేకుండా పోయింది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు జార్జ్ బెయిలీ, స్టీవెన్ స్మిత్ లు అద్భుతమైన బ్యాటింగ్ తో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేరవేశారు. స్టీవెన్ స్మిత్  135 బంతుల్లో 2 సిక్సులు, 11 ఫఓర్లతో 149 పరుగులు, జార్జ్ బెయిలీ 120 బంతుల్లో 2 సిక్సులు, 7 ఫోర్లతో 112 పరుగులు చెయ్యడంతో 310 పరుగులల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. ఫాల్కన్ రెండు వికెట్లు, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 309 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 171 పరుగులు (నాటౌట్), విరాట్ కోహ్లీ 91 పరుగులు చేశారు. కాగా తొలి మ్యాచ్ ఆడుతున్న బరేందర్ శరన్ మూడు వికెట్లతో సత్తా చాటారు. కానీ మొత్తానికి ఐదు వన్డేల సిరీస్ లో భారత్ మొదటి మ్యాచ్ ను పోగొట్టుకోవడం మీద అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  ODI  Team India  Australia  India Vs Australia  India lost the match  

Other Articles