India must win one ODI in Australia to retain second spot

India must win one odi in australia to retain second spot

Indian cricket Team, Team India, ICC Ranking, Australia Tour, Indian cricket team Rank in ICC

World Champions Australia go head-to-head with former World Cup-winners India in a five-match one-day international (ODI) series in Perth on Tuesday with their No.1 ranking secured in the International Cricket Council (ICC) rankings. Australia (127 points) lead second-ranked India (114) by 13 points and even if they lose all five matches of the series, Australia will drop points but will still finish a point ahead of India.

మ్యాచ్ గెలిస్తే టీమిండియా ర్యాంక్ ఫిక్స్.. లేదంటే మిస్

Posted: 01/11/2016 03:27 PM IST
India must win one odi in australia to retain second spot

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్న టీమ్‌ఇండియా(114 పాయింట్లు) తన ర్యాంక్‌ను నిలబెట్టుకోవాలంటే ఆస్ట్రేలియాపై కనీసం ఒక మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలి. రేపటి నుంచి మొదలవుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ధోనీసేన వరల్డ్ నంబర్‌వన్ ఆస్ట్రేలియా(127)ను వారి సొంతగడ్డపై ఎదుర్కొనబోతోంది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల్లో కనీసం ఒక దాంట్లో విజయం సాధించినా టీమ్‌ఇండియా రెండో ర్యాంక్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. అలాగాకుండా ఐదు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం అప్పుడు సౌతాఫ్రికా(112) తర్వాత మూడోర్యాంక్‌కు పడిపోవాల్సి ఉంటుంది. మరోవైపు టీమ్‌ఇండియా చేతిలో ఆసీస్ క్లీన్‌స్వీప్ ఎదుర్కొంటే పాయింట్ల పరంగా తేడావచ్చినా కంగారూల టాప్‌ర్యాంక్‌కు ముప్పుఉండదు.

బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్ కోహ్లీ 804 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉండగా, సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్(900) ఫస్ట్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. టాప్-10లో భారత్ నుంచి కోహ్లీతో పాటు కెప్టెన్ ధోనీ, ధవన్ వరుసగా ఆరు, ఏడు ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా తరఫున అశ్విన్(640) ఒక్కడే పదో ర్యాంక్‌లో ఉండగా, ఆసీస్ స్పిడ్‌స్టర్ మిచెల్ స్టార్క్(713) టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా(266) ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles