Sania Mirza-Martina Hingis Win Brisbane International Title

Sania mirza martina hingis win brisbane international title

Sania Mirza, Martina Hingis, Brisbane International Title, Tennis

Sania Mirza and Martina Hingis continued their dominant run in Women's doubles by winning yet another title at the start of 2016. Sania-Martina defeated the German duo of Angelique Kerber and Andrea Petkovic 7-5, 6-1 to win the Brisbane International Title at the Pat Rafter Arena.

దూసుకెళుతున్న సానియా-హింగిస్

Posted: 01/10/2016 08:25 PM IST
Sania mirza martina hingis win brisbane international title

రంగంలోకి దూకితే టైటిల్స్ దాసోహమవుతున్నాయి. టెన్నిస్ లో సానియా మీర్జా, హింగిస్ జోడీ దూకుడు మీద వరుస విజయాలతో దూసుకెలుతోంది. తాజాగా మరో సారి రికార్డు విజయంతో వార్తల్లో నిలిచింది. 2016లో టెన్నిస్‌కు అద్భుత ఆరంభం. ప్రపంచ నంబర్‌వన్ జోడీకే దాసోహమంది సీజన్ తొలి ట్రోఫీ. డబుల్స్‌లో తిరుగులేని రారాణులుగా వెలుగొందుతున్న సానియా మీర్జా, మార్టినా హింగిస్ బ్రిస్బేన్‌లోనూ సత్తాచాటి 2016కు గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు. గతేడాదిగా వరుస విజయాలతో అదరగొడుతున్న ప్రపంచ టాప్ జంట సానియా-హింగిస్ జంట బ్రిస్బేన్‌లో చాంపియన్‌గా నిలిచింది.

మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ ఇండో-స్విస్ ద్వయం 7-5, 6-1తో జర్మనీకి చెందిన వైల్డ్‌కార్డ్ జంట ఏంజెలికా కెర్బర్-ఆండ్రియా పెట్కోవిక్‌ను చిత్తుచేసి సీజన్‌లో తొలి టైటిల్‌ను ముద్దాడింది. సానియా, హింగిస్‌కిది జంటగా వరుసగా ఆరో టైటిల్, ఓవరాల్‌గా పదో టైటిల్. గతేడాది యూఎస్ ఓపెన్, ఆ వెంటనే వరుసగా గ్వాన్‌గ్జౌ, వుహాన్, బీజింగ్, డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో గెలుపొందిన సానియా-హింగిస్ జోడీకిది వరుసగా 26వ మ్యాచ్ విజయం కూడా కావడం విశేషం. దీంతో ఇటలీ జంట సారా ఎర్రాని-రోబర్టా విన్సీ పేరిటనున్న డబుల్స్‌లో అత్యధిక వరుస విజయా(25)ల రికార్డును సానియా-హింగిస్‌లు అధిగమించారు. డబుల్స్‌లో సానియాకిది కెరీర్‌లో 33వ డబ్ల్యూటీఏ టైటిల్‌కాగా, హింగిస్‌కిది 52వ టైటిల్. ఇక బ్రిస్బేన్ విజయంతో సానియా-హింగిస్ జంట ఈనెలలోనే జరుగనున్న సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Martina Hingis  Brisbane International Title  Tennis  

Other Articles