Australian cricketer Angela Reakes receives two-year suspension

Australian female cricketer given two year ban for small wc bet

ICC Cricket World Cup, Australian Cricket, ausis cricketer, Angela Reakes, Sydney Sixers, ACT Meteors player, betting $9, Cricket World Cup final, Cricket Australia, Cricket, Cricket news

Angela Reakes, the Sydney Sixers and ACT Meteors player, has been penalised by Cricket Australia (CA) for breach of the Anti-Corruption Code and has sanctioned a two-year suspension from playing the game.

ఆసీస్ మహిళా క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం!

Posted: 12/23/2015 02:17 PM IST
Australian female cricketer given two year ban for small wc bet

ఆస్ట్రేలియా క్రికెటర్ ఏంజెలా రీక్స్పై క్రికెట్ అస్ట్రేలియా వేటు వేసింది. ఒక క్రికెటర్ గా వుంటూ కోడ్ అఫ్ కండక్ట్ ఉల్లంఘించిందని అమెపై వేటు వేసింది. సిడ్నీ సిక్సర్స్ గా పేరుతెచ్చుకున్న ఏంజెలా రీక్స్.. బెట్టింట్ ప్రోత్సహించడం, స్వయంగా బెట్టింగ్ కు పాల్పడటం ఇత్యాది నేరాలకు పాల్పడిందని రుజువుకావడంతో అమెపై క్రికెట్ అస్ట్రేలియా రెండేళ్ల పాటు క్రికెట్ అడకుండా నిషేధాన్ని విధించింది. ఈ ఏడాది అస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌పై చాలా మందిలాగే ఆమె కూడా అమితోత్సాహం చూపించింది. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది.

అంతటితో ఆగకుండా సరదాగా బెట్టింగ్ చేసింది. ఫైనల్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు ఎవరికి దక్కుతుందనేదే పందెం కాసింది. దాని విలువ అక్షరాలా 9 డాలర్లు మాత్రమే (సుమారు రూ. 432). అంతేకాదు మొత్తంగా ఐదు రకాల బెట్టింగ్ లు కాసింది. అన్ని కూడా అత్యంత స్వల్ప బెట్టింగ్ లే. అయితే సదరు మహిళ ఆస్ట్రేలియా క్రికెటర్ కావడం వల్ల ఆ నేరం ‘విలువ’ పెరిగిపోయింది. కోడ్ అఫ్ కండక్ట్ ఉల్లంఘించారని అమెపై ..క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల నిషేధం విధించింది.
 
ఇటీవలే ఈ బెట్టింగ్ విషయం బయటపడింది. ఆసీస్ బోర్డు నిబంధనల ప్రకారం ‘ఎలైట్’ గ్రూప్‌లో ఉన్న గుర్తింపు గల క్రికెటర్లు ఎవరూ బెట్టింగ్‌కు పాల్పడకూడదు. నిషేధంతో పాటు అవినీతి వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనాల్సి ఉంటుంది. 25 ఏళ్ల రీక్స్ లెగ్‌స్పిన్నర్. దేశవాళీలో ఏసీటీ జట్టు తరఫున ఆడే ఆమె...ప్రస్తుతం మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. కేవలం 9 డాలర్ల బెట్టింగ్ ఒక మహిళా క్రికెటర్ కెరీర్‌ను నాశనం చేయడం విశేషం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ausis cricketer  Angela Reakes  betting $9  Cricket World Cup final  

Other Articles