'Great' MS Dhoni still has cricket left in him, says Sourav Ganguly

Ganguly says dhoni still has cricket left in him

cricket, ms dhoni, sourav ganguly, team india, Yuvraj Singh, Virat Kohli, BCCI, saourav bats for indo-pak series, ganguly confident of yuvaraj singh, ganguly praises ms dhoni, mahendra singh dhoni

Former India captain Sourav Ganguly today praised the India's limited overs skipper Mahendra Singh Dhoni, stating that he still has a lot of cricket left in him.

దోనిపై ప్రశంసల జల్లు కురిపించిన క్యాబ్ అధ్యక్షుడు దాదా

Posted: 12/23/2015 05:40 PM IST
Ganguly says dhoni still has cricket left in him

టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ధోనీపై మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీ గొప్ప క్రికెటర్ అని... అంతర్జాతీయ క్రికెట్లో ధోని తనదైన ముద్ర వేశాడని అన్నాడు. జార్ఖండ్ లోని ఉక్కునగరంగా పేరోందిన జెంషెడ్ పూర్ లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో హాజరయ్యేందుకు వచ్చిన గంగూలీ.. ధోనిపై ప్రశంసలు కురిపించారు. మరి కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా ధోనీలో ఉందని చెప్పాడు. ధోనీ స్థాయికి ఎవరైనా చేరుకోవాలంటే ప్రతిభతో పాటు, కఠోర శ్రమ కూడా అవసరమని తెలిపాడు.

2019లో జరిగే ప్రపంచ కప్ కు టీమిండియా కెప్టెన్ గా ఎవరు ఉండవచ్చన్న దానికి సమాధానంగా... అది నిర్ణయించడానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు. చాలా కాలం తర్వాత టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్న ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురించి మాట్లాడుతూ, ఆస్ట్రేలియా పర్యటనలో యువీ రాణిస్తాడనే ధీమాను వ్యక్తం చేశాడు. పాక్, భారత్ లు మళ్లీ ఆడాలనే అందరూ కోరుకుంటున్నారని... అయితే, దీనికి సంబంధించిన నిర్ణయాధికారం బీసీసీఐ చేతిలో లేదని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yuvraj Singh  Virat Kohli  Sourav Ganguly  MS Dhoni  BCCI  

Other Articles