Yuvraj Singh Disappointed at Not Making Cut for ODIs in Australia

Disappointed not to be back for odis yuvraj

Yuvraj Singh,Australia Vs India 2016,Cricket Yuvraj Singh Disappointed at Not Making Cut for ODIs in Australia latest Australia Vs India 2016 news,india,Australia,tewnty-20 worldcup

In-form Yuvraj Singh has expressed his disappointment at not being picked in India's ODI squad for Australia tour next month.

ఆశ తీరక నిరాశకు గురవతున్న యువరాజ్

Posted: 12/22/2015 08:03 PM IST
Disappointed not to be back for odis yuvraj

భారత జాతీయ క్రికెట్ జట్టుకు రమారమి 20 నెలల తరువాత ఎంపికైనా అది యువరాజ్ సింగ్ కు  సంతృప్తినిచ్చినట్లు కనపడట్లేదు. వచ్చేనెలలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా వన్డే జట్టులో యువరాజ్‌కు చోటు దక్కకపోవడం అతడిని తీవ్ర నిరాశకు గురి చేసింది. భారత జట్టులో పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలనుకున్న యువరాజ్‌ను టి-20లకు ఎంపికచేసి సెలక్టర్లు కొంతవరకూ న్యాయం చేసినా, వన్డేలకు ఎంపిక చేయకపోవడం అతనికి నిరాశనే మిగిల్చింది. వన్డేలలో యువీ.. ఇటీవలి కాలంలో బాగానే రాణించాడు.

దీనికి ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే వన్డే ట్రోఫీనే ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో యువరాజ్ ఐదు మ్యాచ్‌లు ఆడి 341 పరుగులు చేశాడు. మూడు హాఫ్ సెంచరీల సాయంతో 85.25 సగటు నమోదు చేశాడు. ఇందులో రెండుసార్లు 90 పరుగుల మార్కును కూడా చేరాడు. దీంతో యువరాజ్‌కు వన్డేల్లో స్థానం దక్కే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అయితే చివరకు మూడు టి-20 మ్యాచ్‌ల సిరీస్‌కే యువీని పరిమితం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yuvraj Singh  india  Australia  tewnty -20 world cup  

Other Articles