India climb to No. 2 in ICC Test rankings with 3-0 win over SA

India rise to second spot in icc test rankings

India rise to second spot in ICC Test rankings, india south africa, south africa india, india icc rankings, icc rankings india, indvssa, savind, cricket news, cricket

The 3-0 series result has helped Virat Kohli's side gain 10 points, which has lifted it from 100 points to 110 points.

ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానానికి మళ్లీ భారత్

Posted: 12/07/2015 06:40 PM IST
India rise to second spot in icc test rankings

మండేలా-గాంధీ ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో సిరీస్ ను గెలిచిన టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్ లో మళ్లీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. నాల్గో టెస్టులో విజయంతో  విరాట్ సేన టెస్టు ర్యాంకింగ్స్ లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని ఆసీస్ ను వెనక్కునెట్టింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా 110 పాయింట్లతో రెండో స్థానం సాధించగా, ఆసీస్ 109 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది.  

అయితే టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను  దక్షిణాఫ్రికా కోల్పోయినా  ర్యాంకింగ్స్ లో మాత్రం ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. దక్షిణాఫ్రికా 114 పాయింట్లతో మాత్రం తొలి స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా పాకిస్థాన్ (106 పాయింట్లు), ఇంగ్లండ్(99 పాయింట్లు) ఐదో స్థానంలో ఉన్నాయి. ఆ తదుపరి వరుస స్థానాల్లో న్యూజిలాండ్ (95 పాయింట్లు) , శ్రీలంక(93 పాయింట్లు) , వెస్టిండీస్(76 పాయింట్లు), బంగ్లాదేశ్(47 పాయింట్లు), జింబాబ్వే(5 పాయింట్లు) లు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  south africa  second spot  ICC Test rankings  cricket  

Other Articles