India win by 337 runs, clinch series 3-0

India break blockathon to win series 3 0

India vs south africa,Twitter reacts after Virat Kohli & co. clinch Test series 3-0,Twitter reactions,Twitter reaction,India vs South Africa Test Series,India clinch Test series against South Africa,India vs South Africa 4th Test,Virat Kohli,Ravichandran Ashwin,Hashim Amla,AB de Villiers,Ravindra jadeja,Ajinkya Rahane,India vs South Africa 2015,

South Africa's top batsmen failed to deny India a victory at Delhi's Feroz Shah Kotla. Ravichandran Ashwin and Umesh Yadav were at the forefront again on a crumbling Day 5 pitch as India rose to No. 2 in the ICC rankings.

సఫారీలపై 337 పరుగుల విజయం.. 3-0తో సిరీస్ స్వీప్..

Posted: 12/07/2015 05:17 PM IST
India break blockathon to win series 3 0

సౌతాఫ్రికాతో జరిగిన మండేలా గాంధీ ఫ్రీడమ్ సిరసీ్ లో నాలుగు టెస్టుల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. రెండవ టెస్టు వర్షార్పణం కాగా, మిగిలిన మూడు టెస్టులనూ గెలుచుకున్న భారత జట్టు 3-0 తేడాతో సిరీస్ ను సగర్వంగా చేతుల్లోకి తీసుకుంది. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన టెస్టులో భారత్ 337 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి టెస్టు.. కనీసం గెలవకపోయినా డ్రా చేయాలని సఫారీలు శతవిధాలా ప్రయత్నించారు.

అటు హషీమ్ ఆమ్లా దగ్గర్నుంచి.. ఇటు ఏబీ డివిలియర్స్ వరకూ ఎంతో శ్రమించారు. టీమిండియా బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ అత్యంత రక్షణాత్మక పద్ధతిని అవలంభించారు. ఆమ్లా 244 బంతుల్లో 25 పరుగులు, డివిలియర్స్ 297 బంతుల్లో 43 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను గట్టెక్కించే యత్నం చేశారు. మ్యాచ్ ని ఎలాగైనా డ్రాగా ముగించాలని చూసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్ల పప్పులు, భారత బౌలర్ల ముందు ఉడకలేదు. రెండవ ఇన్నింగ్స్ లో 143.1 ఓవర్లలో 143 పరుగులు చేసి సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.

481 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు 143 పరుగులకే చాపచుట్టేశారు. 72/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు మరో 71 పరుగుల మాత్రమే చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయారు.  ఈ రోజు ఆటలో టీ విరామం వరకూ మ్యాచ్ ఫలితంపై పెద్దగా అంచనాలు లేకపోయినా తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీమిండియా బౌలర్లు వరుసగా వికెట్లు తీసి సఫారీలకు మరో షాకిచ్చారు. రత బౌలర్లలో అశ్విన్ 5, యాదవ్ 3, జడేజా 2 వికెట్లు పడగొట్టారు. దాంతో టీమిండియా 337 పరుగులతో ఘన విజయం సాధించడమే కాకుండా సిరీస్ ను 3-0 తేడాతో గెలిచింది. అంతేకాదు ఈ విజయంతో టెస్టు ర్యాకింగ్ లలో రెండవ స్థానానికి టీమిండియా ఎగబాకింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  south africa  ind vs sa  test series  fourth test  

Other Articles