Ishant likely to replace Umesh, Steyn still doubtful for 2nd Test

Ishant likely to replace umesh steyn still doubtful for bengaluru test

After serving a one match suspension, Indian pacer Ishant Sharma is all set for a return to the test squad, replacing Umesh Yadav

After serving a one match suspension, Indian pacer Ishant Sharma is all set for a return to the test squad, replacing Umesh Yadav

ఉమేశ్ స్థానంలోఇషాంత్.. స్టీన్ కు రెస్ట్

Posted: 11/13/2015 05:31 PM IST
Ishant likely to replace umesh steyn still doubtful for bengaluru test

దక్షిణాఫ్రికాతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం ప్రారంభంకానున్న రెండో టెస్టు మ్యాచ్ టీమిండియా స్వల్ప మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో ఉమేష్ యాదవ్ స్థానంలో ఇషాంత్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇషాంత్ పై ఉన్న ఒక టెస్టు నిషేధం కూడా ముగిసింది. దీంతో, అతని రాకకు మార్గం సుగమమయింది. మరోవైపు, నెట్స్ లో ఇషాంత్ చెమటోడుస్తున్నాడు. దీంతో, కొత్త బంతిని ఇషాంత్, వరుణ్ అరోన్ లు పంచుకుంటారని విశ్వసనీయ సమాచారం.

మరోవైపు సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ స్టెయిన్ రెండో టెస్టులో ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో కండరాల నొప్పితో బాధపడిన స్టెయిన్ ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. స్టెయిన్ జట్టులో ఉంటాడా? లేదా? అనే విషయంపై కెప్టెన్ డీవిలియర్స్ కూడా అనుమానాస్పదంగానే సమాధానమిచ్చాడు. స్టెయిన్ తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది... అందువల్ల అతను 100 శాతం ఆడతాడు అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 'India vs South Africa 2015  Ishant Sharma  Umesh Yadav  Cricket'  

Other Articles