When British Airways asked Sachin Tendulkar for his full name

Sachin tendulkar and family left frustrated by british airways

Sachin Ramesh Tendulkar,Cricket Sachin Tendulkar Blasts British Airways on Twitter For Grounding Him, Sachin TendulkarBritish AirwaysMaria SharapovaTwitter latest Cricket news

Sachin Tendulkar, who is travelling with his family, blasted British Airways on Twitter after the cricket legend faced flight issues with the noted airline.

సచిన్ టెండుల్కర్ కు బ్రిటీష్ ఎయర్ వేస్ క్షమాపణలు

Posted: 11/13/2015 05:28 PM IST
Sachin tendulkar and family left frustrated by british airways

భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కు బ్రిటిష్ ఎయిర్ వేస్ క్షమాపణ లు చెప్పింది. సచిన్ లాంటి ప్రముఖ క్రికెటర్ కు తమ సంస్థ ద్వారా జరిగిన ఇబ్బందులకు తాము క్షమాపణలు చెబుతున్నామని బ్రిటీష్ ఎయిర్ వేస్ కాల్ సెంటర్ ట్విట్టర్ ద్వారా పేర్కోంది. అసలు ఇంతకీ ఎం జరిగిందని అనుకుంటున్నారా..? బ్రిటీస్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థ సచిన్ కు క్షమాపణలు ఎందుకు చెప్పందని ఆరీ తీస్తున్నారా..?

నిత్యం చిరునవ్వులు చిందిస్తూ కనబడే సచిన్ ఇవాళ అందుకు భిన్నంగా బ్రిటిష్ ఎయిర్ వేస్ పై ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అది కూడా విశ్వవ్యాప్తమైన సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అయన తన ఆగ్రహాన్ని చూవిచూపారు. ప్రస్తుతం ఆల్ స్టార్ క్రికెట్ టోర్నీ కోసం అమెరికాలో ఉన్న సచిన్, తన కుటుంబ సభ్యులకు సీట్లు కేటాయించడంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు.   

సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ తన కుటుంబసభ్యుల టికెట్లు కన్ ఫర్మ్ చేయకుండా ఆ విమానయాన సంస్థ తమను ఇబ్బందులకు గురి చేసిందని సచిన్ మండిపడ్డారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ వ్యవహార సరళితో తాను అసహనానికే కాక అసంతృప్తి, ఆగ్రహానికి కూడా గురయ్యానని సచిన్ వ్యాఖ్యానించారు. అంతేకాక తన లగేజీని తాము సూచించిన గమ్యానికి కాకుండా వేరే ప్రాంతానికి తరలించిందని కూడా శివాలెత్తారు ‘‘నా పట్ల మీ ‘డోంట్ కేర్’ వ్యవహార సరళి ఏమీ బాగోలేదు’’ అంటూ సచిన్ ఘాటు వ్యాఖ్యలే చేశారు.  అది విస్తృతంగా ప్రచారం అవడంతో బ్రిటిష్ ఎయిర్ వేస్ దృష్టికి వెళ్లి అప్పాలజీ చెప్పడానికి ముందుకు వచ్చింది. లగేజీ వివరాలు పూర్తి అడ్రెస్ ఇస్తే అక్కడికే చేరుస్తామని ఆ సంస్థ పేర్కొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  luggage  british airways  appology  

Other Articles