Am not a nice guy, can sledge Virat Kohli to win match: AB de Villiers

Don t mind sledging virat kohli to win match ab de villiers

AB de Villiers, sledging,​ intimidate, Virat Kohli, India vs South Africa, Test cricket, Bengaluru, Chinaswamy stadium, AB de Villiers 100th match, AB de Villiers not a nice guy, football, best batsman, cricket news

AB de Villiers said that his forays into other sports have helped him mould into the cricketer that he is today.

గెలుపు కోసం స్లెడ్జింగ్ కైనా పాల్పడతాం..!

Posted: 11/13/2015 05:39 PM IST
Don t mind sledging virat kohli to win match ab de villiers

భారత్ తో జరిగిన పోట్టి ఫార్మెట్, వన్డే సిరీస్ లను కైవసం చేసుకున్న దక్షిణాప్రికాకు ఇంకా విజయదాహం తీరినట్టు లేదు. టెస్టు సిరీస్ ను కూడా తమ పేర రాసుకోవాలని ఉవ్విళ్లూరుతన్న సఫారీలు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి హెచ్చరికలు జారీ చేశాయి. తొలి టెస్టులో ఘోర పరాభవం మూటగట్టుకున్న సఫారీలు బెంగళూరులో జరిగే రెండో టెస్టును ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో, అవసరమైతే స్లెడ్జింగ్ చేయడానికి కూడా తాము వెనుకాడమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ హెచ్చరికలు జారీ చేశాడు. ఫీల్డ్ లో ఉన్నప్పుడు తాను మంచోడిని కాదని... విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడి ఏకాగ్రతను భగ్నం చేయడానికి అవసరమైతే స్లెడ్జింగ్ చేయడానికి కూడా వెనుకాడనని స్పష్టం చేశాడు.

తనకు గెలవడమే ముఖ్యమని... దానికోసం ఏమైనా చేస్తానని సఫారీ కెప్టెన్ చెప్పాడు. కోహ్లీ టెక్నిక్, చిన్న లోపాలను గురించి కామెంట్ చేస్తూ అతడి ఏకాగ్రతను దెబ్బతీస్తానని చెప్పాడు. ఇదంతా ఆటలో భాగమేనని... గ్రౌండ్ బయట తాను చాలా మంచి వ్యక్తినని తెలిపాడు. మరోవైపు, డివిలియర్స్ రేపు తన 100వ టెస్ట్ ఆడుతున్నాడు. దీనిపై అతను స్పందిస్తూ, ఇంత స్థాయికి ఎదుగుతానని, 100వ టెస్ట్ ఆడుతానని తాను ఎన్నడూ ఊహించలేదని చెప్పాడు. ఇదెంతో గర్వంగా ఉందని తెలిపాడు. 99 టెస్టుల్లో డివిలియర్స్ 7,685 పరుగులు చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AB de Villiers  sledging  ? intimidate  Virat Kohli  India vs South Africa  

Other Articles