Not Sourav Ganguly, Not MS Dhoni, Anil Kumble My Favorite Captain: Virender Sehwag

Kumble my favorite captain virender sehwag

India,Sourav Ganguly,MS Dhoni,Anil Kumble,Virender Sehwag,Cricket Not Sourav Ganguly, Not MS Dhoni, Anil Kumble My Favorite Captain: Virender Sehwag latest Cricket news

Virender Sehwag, who retired on October 20 from international cricket, said Anil Kumble backed him to the hilt. The Delhi dasher debuted under Sourav Ganguly and played the 2011 World Cup alongside Mahendra Singh Dhoni.

నా ఫేవరెట్ కెప్టెన్ అనీల్ కుంబ్లేనే..

Posted: 11/04/2015 07:15 PM IST
Kumble my favorite captain virender sehwag

అనిల్ కుంబ్లే తన ఫేవరెట్ కెప్టెన్ అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. కుంబ్లే మాదిరిగా తనకు ఏ కెప్టెన్ కూడా అండగా నిలవలేదని చెప్పాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కంటే కుంబ్లేనే తనకు ఎక్కువ మద్దతు ఇచ్చాడని సెహ్వాగ్ తెలిపాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, గంగూలీలు తనకు అండగా నిలిచినా.. అందరికన్నా అధిక ప్రోత్సహం తనకు అనిల్ కుంబ్లే ద్వారానే లభించిందని చెప్పాడు వీరూ. అక్టోబర్ 20న అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు వీరూ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే భారత్ క్రికెట్కు దశాబ్దంపైగా సేవ చేసిన తనకు ఫేర్వెల్ మ్యాచ్ లేకపోవడం వెలితిగా ఉందంటూ సెలెక్టర్లను విమర్శించిన వీరూ మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. బ్యాటింగ్ లైనప్లో మిడిలార్డర్లో ఆడాలని భావించిన సమయంలో తనను జట్టు నుంచి తప్పించారని చెప్పాడు. మిడిలార్డర్ బ్యాట్స్మన్గా కెరీర్ను ముగించాలని కోరుకున్నానని సెహ్వాగ్ తన మనసులో మాటను బయటపెట్టాడు. కాగా సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా వున్నప్పుడు జట్టులోకి వచ్చిన వీరూ.. 2011లో భారత్ ప్రపంచ కప్ సాధించినప్పడు మాత్రం ధోని నేతృత్వంలో ఆడాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anil kumble  virendra sehwag  indian cricket  

Other Articles