Inzamam ul-Haq to be Afghanistan coach for 2 years

Inzamam ul haq to be afghanistan coach

inzamam-ul-haq, inzamam afghanistan, afghanistan inzamam coach, inzamam coach, afghanistan inzamam coach cricket, cricket news, cricket

Inzamam-ul-Haq agreed to be batting consultant for the recent tour of Zimbabwe where Afghanistan scored a historic series win.

సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నా ఇంజమామ్

Posted: 11/04/2015 07:27 PM IST
Inzamam ul haq to be afghanistan coach

పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్- హక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమణ పొందిన తరువాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఆయన త్వరలో క్రికెట్ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. అది కూడా క్రికెట్ లో పసికూనగా వున్న అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ గా అతడు ఎంపికయ్యాడు. రెండేళ్ల పాటు అతడీ పదవిలో కొనసాగనున్నాడు. ఈమేరకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇంజమామ్ అంగీకరించాడని అఫ్గానిస్థాన్ మాజీ కోచ్, పాకిస్థాన్ క్రికెట్ సెలెక్టర్ కబీర్ ఖాన్ తెలిపారు.

జింబాబ్వేతో మ్యాచ్ గెలిచాక అఫ్గానిస్థాన్ ప్రదర్శనపై ఇంజమామ్ సంతృప్తి వ్యక్తం చేశాడని, కోచ్ కు ఉండేందుకు ఒప్పుకున్నాడని చెప్పాడు. పసికూనగా వుండి జింబాబ్వేపై చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని నమోదు చేసిన తరువాత అఫ్ఘనిస్తాన్ క్రికెటర్లలో ఎదగాలన్న వాంఛ ఎంతగానో వుందని అర్థం చేసుకున్న ఆయన అందుకు అంగీకరించినట్లు తెలిపాడు. ఇంజమామ్ గొప్ప ఆటగాడని, అతడి నేతృత్వంలో అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు ప్రమాణాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ తరపున ఇంజమామ్ వుల్-హక్ 120 టెస్టులు, 388 వన్డేలు ఆడాడు. పాకిస్థాన్ టీమ్ కు కోచ్ గా రెండేళ్ల క్రితం అతడికి అవకాశం వచ్చింది. అయితే పాక్ క్రికెట్ బోర్డుతో ఆర్థిక వివాదాల కారణంగా ఆ అవకాశాన్ని అతడు తిరస్కరించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Inzamam ul-Haq  Afghanistan  cricket coach  

Other Articles