Baap Baap hota hain aur beta beta: Kapil Dev on MS Dhoni and Virat Kohli as captains

Too early to compare kohli with dhoni kapil dev

virat kohli, ms dhoni, kapil dev, kohli india, kohli dhoni comparisons, kohli dhoni news, news kohli dhoni, cricket news, cricket

Kapil Dev said it's too early to compare former Test captain MS Dhoni and current leader Virat Kohli.

ధోని, కోహ్లీలను తండ్రీ కొడుకులుగా పోల్చిన కపిల్

Posted: 11/04/2015 07:13 PM IST
Too early to compare kohli with dhoni kapil dev

టీమిండియా టెస్టు మ్యాచ్ కెప్టెన్సీ భారాన్ని ఈ మధ్యనే తలకెత్తుకున్న విరాట్‌ కోహ్లీని.. అంతకు ముందు ఆ బాధ్యతలను నిర్వహించిన మాజీ కెప్టన్ మహేంద్రసింగ్ ధోనీతో పోల్చడం తొందరపాటే అవుతుందని మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నాడు. ధోనీ, కోహ్లీల్లో ఎవరు ఉత్తమ కెప్టెన్‌ అని ప్రశ్నిస్తే.. ‘తండ్రి తండ్రే.. కొడుకు కొడుకే’ అని వారిద్దరినీ తండ్రి కొడుకులుగా పోల్చా చమత్కరించాడు కపిల్‌. ధోనీ సాధించిన విజయాలను అందుకోవాలంటే కోహ్లీ సుదీర్ఘ ప్రయాణం చేయాలన్నాడు. బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు.

టీమిండియా టెస్టు కెప్టెన్ గా కూడా వీరాట్ కోహ్లీ అదే స్థాయిలో అదరగొడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌-దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌పై మాట్లాడుతూ.. పిచ్‌లను బట్టే ఫలితం కూడా ఉంటుందన్నాడు. ‘టీమిండియా బలాబలాలను దృష్టిలో ఉంచుకుని పిచ్‌లను తయారు చేస్తే భారత జట్టు మెరుగ్గా రాణిస్తుంది. స్పిన్నర్లకు సహకరించే బ్యాటింగ్‌ వికెట్‌ అయితే బాగుంటుంది. ఒకవేళ క్యూరేటర్లు దక్షిణాఫ్రికా ఆట తీరుకు సరిపోయే పిచ్‌లను రూపొందిస్తే గెలవడం కష్టమేన’ని అన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapil Dev  comparision  Virat Kohli  Test captaincy  Mahendra Singh Dhoni  

Other Articles