he was a nightmare, Dale Steyn on Virender Sehwag

Virender sehwag was a nightmare says dale steyn

Virender Sehwag, Virender Sehwag, dale steyn, South Africa, number one pacer, nightmare, Indian national selectors, Sehwag farewell Test match, latest Cricket news

South Africa's world number one pacer Dale Steyn today said nobody comes close to being the nightmare that the recently-retired Virender Sehwag was in his prime.

సింహస్వప్న ఓపెనర్ వీరూ దరి చేరేవారెవరు.?

Posted: 11/03/2015 05:37 PM IST
Virender sehwag was a nightmare says dale steyn

దేశం తరఫున 12 సంవత్సరాలు ఆడిన క్రికెటర్‌కు కనీసం వీడ్కోలు మ్యాచ్ ఆడే అర్హత ఉండదా అని ప్రశ్నించిన భారత మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలపై సెలెక్షన్ కమిటీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి.. విమర్శలు గుప్పించిన తరుణంలో ఆయనకు భారత్ నుంచి అభిమానుల మినహా మరెవ్వరూ మద్దతుగా నిలువకపోయినా.. ప్రపంచ నెంబర్ వన్ పేస్ బౌలర్ డేల్ స్టీన్ మాత్రం ఆయనకు గత కీర్తిని కోనియాడుతూ అండగా నిలిచారు. సేహ్వాగ్ వ్యాఖ్యలపై  సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరును ఆయన అభిమానులు సామాజిక మాద్యమం ద్వారా తూర్పారబట్టారు.

కాగా దక్షిణాఫ్రికా క్రికెటర్, ప్రపంచ నెంబర్ వన్ పేసర్ డేల్ స్టీన్ వీరేంద్ర సెహ్వాగ్ పై స్పందిస్తూ.. ఆయన లాంటి సింహస్వప్నాన్ని తాను చూడలేదన్నారు. టీమిండియా ఓపెనర్ గా ఆయన రాణించిన కాలంలో ఆయన బౌలర్ల పాలిట సింహస్వప్నంగా వున్నారని అన్నారు. ప్రస్తుత టీమిండియా జట్టు బ్యాటింగ్ లైన్ అప్ బాగానే వుందని వ్యాఖ్యానించిన స్టీన్.. టీమిండియాలో వీరేంద్ర సెహ్వాగ్ లాంటి సింహస్వప్న ఓపెనర్ దరికి చేరుకునే వారు మాత్రం లేరని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆయన మంచి ఫామ్ లో వున్న సమయంలో బౌలర్లకు ముచ్చెమటలు పల్టేవన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  dale steyn  South Africa  number one pacer  bcci selectors  Cricket  

Other Articles