Harbhajan, Ashwin are chuckers, claims Pakistan's Ajmal

Ajmal s doosra bhajji and ashwin are chuckers

Cricket, Pakistan Cricket Board, Pakistan Cricketer, pakistan spinner, Saeed Ajmal, Harbhajan Singh, Ravichandran ashwin, BCCI, ICC, icc ‘illegal action’, Pakistani players, Faisalabad-born cricketer, ICC pro-BCCI attitude, Cricket news, bcci, Bhajji, Ashwin, bowling action, Pakistan off-spinner, latest Cricket news

The Pakistan Cricket Board (PCB) officials' recent misadventure in India has taken a fresh turn as the Ministry of Inter Provincial Coordination (IPC) has sought an explanation from the board on whether its ill-planned trip was backed and supported by the authorities concerned in Pakistan.

హర్భజన్, అశ్విన్ లపై విషం కక్కిన పాకిస్తాన్ క్రికెటర్..

Posted: 11/03/2015 06:10 PM IST
Ajmal s doosra bhajji and ashwin are chuckers

నటులు, కళాకారులు, క్రీడాకారులకు ఎల్లలు లేవని భారత్ లో వాదనలు తెరపైకి వస్తున్న క్రమంలో దాయాధి దేశం క్రికెటర్ మాత్రం మన దేశ స్పిన్నర్లపై విషం కక్కుతున్నారు. టీమిండియాలో కీలక స్పిన్నర్లుగా కొనసాగుతున్న హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ల బౌలింగ్ యాక్షన్ పై పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ తీవ్ర ఆరోపణలు చేశాడు. హర్భజన్, అశ్విన్ల యాక్షన్ పై తనకు చాలా అనుమానాలున్నాయి. నిజానికి వాళ్లిద్దరూ చకింగ్ చేస్తారని,  ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది' అని అజ్మల్ అన్నారు. హర్భజన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆయన చేయి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంచుతాడని ఆయన సవాల్ విసిరాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం దానిని చకింగ్ గానే పరిగణిస్తారని వ్యాఖ్యానించాడు.

పాకిస్థాన్ కు చెందిన ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజ్మల్ ఈ కామెంట్లు చేసినట్లు.. ఆయనను ఇంటర్వ్యూ చేసిన టీవీ యాకంర్ జైనాబ్ అబ్బాస్ వెల్లడించారు. అజ్మల్ ఇంతగా ఫ్రస్ట్రేట్ కావటం ఇదవరకెన్నడూ చూడలేదని అన్నారు. ఈ మేరకు మంగళవారం అబ్బాస్ కొన్ని ట్వీట్లు వదిలాడు. పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ కు చెందిన 33 ఏళ్ల సయూద్ అజ్మల్ చకింగ్ చేస్తున్నాడని నిరూపణ కావడంతో గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరణకు గురైయ్యాడు. అప్పటి నుంచి పాకిస్థాన్ జట్టులోకి రావాలని ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో.. ఆయన ప్రతి విమర్శలకు దిగుతున్నాడు.

తన బౌలింగ్ ను మెరుగుపర్చుకుని జట్టులోకి రాలేని అజ్మల్.. టీమిండియా స్పిన్నర్లపై విమర్శలు విసురుతూ.. తన ఉనికిని చాటుకుంటున్నాడు. అంతేకాదు ప్రస్తుతం పనిపాట లేక ఖాళీగా వున్న ఈయన గారు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ మండలిపై కూడా విమర్శలను గుప్పించారు. ఐసిసి.. బిసిసిఐకి మద్దతుగా వ్యవహరిస్తుందని అన్నాడు. బౌలింగ్ నిబంధనలు పాకిస్థాన్ క్రికెటర్లు మాత్రమే వర్తింపజేసి.. చకింగ్ చేస్తున్నారని పక్కన పెడుతున్నారని, అదే బిసిసిఐ విషయానికి వస్తే.. టీమిండియా సిన్నర్లు చాకింగ్ చేస్తున్నా వారిని చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారని అజ్మల్ విమర్శలు గుప్పించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan Cricketer  Saeed Ajmal  Harbhajan Singh  Ravichandran ashwin  BCCI  ICC  Cricket news  

Other Articles