Gautam Gambhir, Manoj Tiwary almost exchange punches during Ranji Trophy match

Gautam gambhir abuses manoj tiwary threatens to beat him up

Ranji Trophy, Manoj Tiwary, Gautam Gambhir, Cricket. delhi, west bengal, Gautam Gambhir Abuses Manoj Tiwary, Threatens to Beat Him Up latest Cricket news

The Feroz Shah Kotla ground saw some ugly scenes during a Ranji Trophy round four game between Delhi and Bengal as captains Gautam Gambhir and Manoj Tiwary almost exchanged blows, post an altercation.

తన్నుకున్న ఇండియన్ క్రీకెటర్లు.. అంఫైర్ తోసివేత

Posted: 10/24/2015 05:42 PM IST
Gautam gambhir abuses manoj tiwary threatens to beat him up

ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఇద్దరు టీమిండియాకు చెందిన ప్రముఖ క్రికెటర్లు తన్నుకున్నారు. అదీ ఎంతలా అంటే.. అడ్డుకునేందుకు వచ్చిన అంఫైర్ ను కూడా తోసేసి మా మద్యలోకి రావద్దంటూ తోసేయడంతో పాటు హెచ్చరించేవరకు వెళ్లింది. అంతటితో ఆగని ఓ క్రికెటర్ కాలేజ్ విద్యార్థి మాదిరిగా బయటకురా చూసుకుందామని సవాల్ చేయడం వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ, పశ్చిమబెంగాల్ మ్యాచ్ సందర్భంగా గౌతం గంభీర్, మనోజ్ తివారీ కొట్టుకున్నారు. రంజీ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.

ఇద్దరు కెప్టెన్ మధ్య చోటుచేసుకుంటున్న వివాదాన్ని సమసిపోయేలా చర్యలు తీసుకునేందుకు మధ్యలో జోక్యం కల్పించుకున్న అంపైర్ శ్రీనాథ్‌ను కూడా గంభీర్ తోసివేసినట్లు తెలిసింది. మ్యాచ్ రిఫరీ గౌతం గంభీర్, మనోజ్ తివారీకీ సమన్లిచ్చారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఎనిమిదో ఓవర్‌ సందర్భంగా తివారీకి, గౌతం గంభీర్‌కు మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. మ్యాచ్ అయిపోనీ, బయటకెళ్లాక నా తడాఖా చూపిస్తా అంటూ గౌతం గంభీర్ మనోజ్ తివారీని బెదిరించినట్లు తెలిసింది.

తివారీ, గంభీర్‌ల మధ్య కొట్లాటను అదుపు చేసేందుకు యత్నించిన ఎంపైర్ శ్రీనాథ్‌ను గంభీర్ తోసివేసినట్లు తెలిసింది. తమ గొడవ మధ్యలోకి రావద్దని హెచ్చరించినట్లు సమాచారం. కాగా ఎంపైర్ శ్రీనాథ్‌ను తోసివేసిన గంభీర్‌పై నిషేధం తప్పదని సమాచారం. ఇప్పటికే మ్యాచ్ రిఫరీ ఆటగాళ్లిద్దరికీ సమన్లు పంపడంతో గౌతం గంభీర్‌పై నిషేధం ఖాయమని తెలుస్తోంది. అయితే ఎంత కాలం నిషేధం విధిస్తారు. ఏ ఏ మ్యాచ్‌లలో గంభీర్‌పై నిషేధం ఉంటుందనే సమాచారం తెలియాల్సి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ranji Trophy  Manoj Tiwary  Gautam Gambhir  Cricket  

Other Articles