Mahendra Singh Dhoni May Play For New Team For IPL 2016

After 8 years at csk dhoni set to join new ipl team

ms dhoni, dhoni, cricketer, ipl, indian premier league, dhoni indian captain, dhoni ipl jersey, chennai super kings, ipl csk captain, csk suspension, csk dhoni jersey, ms dhoni ipl, ipl ms dhoni, ms dhoni india, india captain ms dhoni, ms dhoni indian premier league, cricket news, cricket

With CSK now suspended, MS Dhoni might make a move to a different team.

ఐపీఎల్ లో ధోని వేసుకోనున్న జెర్సీ ఏదీ..?

Posted: 10/24/2015 05:33 PM IST
After 8 years at csk dhoni set to join new ipl team

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గత ఏనమిది సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్ తరపున ఆడిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. పసుపు పచ్చ సీఎస్కే జెర్సీ ధరించి గ్రౌండ్ లోకి దిగాడు. ఐపీఎల్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ల పాటు నిషేధానికి గురైన నేపథ్యంలో. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపైనే ప్రస్తుతం క్రీడావర్గాలతో పాటు ధోనీ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఉన్న స్టార్డమ్ ఒక్క ధోనీకే ఉంది. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం... ధోనీని రూ. 7.5 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. అప్పటినుండి జరిగిన ఎనిమిది సీజన్లలోనూ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా సేవలందించారు. మరి రాబోయే సీజన్లో ఈ అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ వేలంలో నిలుస్తాడా? మరో జట్టుతో చేరబోతున్నాడా? అనే ప్రశ్నలకు  అవుననే సంకేతాలే కన్పిస్తున్నాయి.

రాబోయే ఐపీఎల్ సీజన్లో ధోనీని పసుపురంగు జెర్సీలో కాకుండా వేరే రంగు జెర్సీలో చూడబోతున్నారనడానికి సంకేతాలు వెలువడుతున్నాయి. బెస్ట్ ఐపీఎల్ కెప్టెన్, టీ-ట్వంటీలో అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్గా పేరున్న ధోనీని దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయనడంలో సందేహం లేదు. దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ముంబైలో జరగనుంది. ధోనీ ముంబైకి వెళ్తూ శుక్రవారం చెన్నైలో శ్రీనివాసన్ను కలిశారు. ఈ నేపథ్యంలో ధోనీ భవిష్యత్ ఐపీఎల్ కార్యాచరణపై క్రీడావర్గాలలో చర్చకు వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్పై నిషేధం ఉన్నందున రెండేళ్ల పాటు ధోనీని నిరీక్షించమని ఫ్రాంచైజీ కోరదు .ధోనీ వేలంలో పాల్గొంటాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్లో అభిమానులు ధోనీని పసుపు రంగులో కాకుండా వేరే రంగు జర్సీలో చూడనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS dhoni  IPL  Chennai super Kings  jersey  

Other Articles