One game we played well in all departments said Dhoni

Dhoni praises indian cricket players

Dhoni, MS Dhoni, Team India, India, SouthAfrica, mandela-Gandhi series, Dhoni paises team India, harbhajan singh, Virat Kohli

Praising centurion Virat Kohli for his superb batting in the side's series-levelling win against South Africa, Indian skipper Mahendra Singh Dhoni today said that it was the first game in which his team did well in all the three departments.

టీమిండియా క్రికెటర్లపై ధోనీ పొగడ్తల వర్షం

Posted: 10/23/2015 03:56 PM IST
Dhoni praises indian cricket players

టీమిండియాపై గత కొంత కాలంగా వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పడింది. బ్యాటింగ్ లో, బాలింగ్ లో ఫీల్డింగ్ లో కూడా మన క్రికెటర్లు అదరగొట్టి సౌతాఫ్రికాతో జరుగుతున్న మండేలా-గాంధీ సిరీస్ లో 2-2తో సిరీస్ ను సమం చేశారు. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో అన్నీ విబాగాల్లో ఆటగాళ్లు అదరగొట్టారు. కనీసం చిన్న పాటి స్కోర్ ను కూడా ఛేజ్ చెయ్యలేక మూడో వన్డేను చేజేతులా వదులుకున్న టీమిండియా నాలుగో వన్డేలో మాత్రం ఎలాంటి పొరపాట్లను తావులేకుండా చాలా జాగ్రత్తగా ఆడింది. టీమిండియా పర్ఫామెన్స్ ను అందరూ మెచ్చుకున్నారు. మరి టీమిండియా కెప్టెన్.. కెప్టెన్ కూల్ ఏమంటున్నారు..? ధోనీ మనోగతం ఏంటో తెలుసుకోవాలా అయితే మొత్తం స్టోరీ చదవండి.

నాలుగో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాళ్లకు మన వాళ్లు అసలు ఆట రుచి చూపించారు. బ్యాటింగ్ కు ముందు నుండి మంచి పేరున్న ఆటగాళ్లు గత కొంత కాలంగా ఫాంలో లేరు. దాంతో బ్యాటింగ్ లో కూడా పెద్దగా కలిసిరావడం లేదు. కానీ నాలుగో వన్డేలో మాత్రం అందరూ బ్యాట్స్ మ్యాన్ లు తమ బ్యాట్ లకు పని చెప్పారు. ముఖ్యంగా గత కొంత కాలంగా పాంలో లేని కోహ్లీ అదరగొట్టాడు. అలాగే బౌలర్లు కూడా అద్భుతమైన బౌలింగ్ తో సౌతాఫ్రికా ఆటగాళ్లను కట్టడి చెయ్యగలిగారు. కెప్లెన్ కూల్ ధోనీ కూడా ఇదే అంటున్నారు. టీమిండియా బ్యాటింగ్, బాలింగ్, ఫీల్డింగ్ లో కూడా అందరూ అదరగొట్టారని కాబట్టి విజయం సాధ్యమైందని ధోనీ వెల్లడించారు. హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ పటేల్, అమిత్ మిశ్రాలు కూడా అద్భుత బౌలింగ్ తో అదరగొట్టారు అని ధోనీ మెచ్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles