Virat kohli creates new records in cricket

Virat kohli creates new records in cricket

Virat Kohli, Virat Kohli News, Virat Kohli records, Virat Kohli new records, Virat Kohli power play, Virat Kohli creats new record, Virat Kohli updates, Virat Kohli in Team India

Flamboyant Indian right-hander Virat Kohli has already scored 23 centuries in his spectacular ODI career.Kohli's latest century came against South Africa in a winning cause. Here is a complete list of all ODI centuries scored by him

కొత్త రికార్డులకు కేరాఫ్ గా కోహ్లీ

Posted: 10/23/2015 03:23 PM IST
Virat kohli creates new records in cricket

రికార్డులు కొట్టాలంటే ఎక్కువ కాలం ఆడాల్సిన అవసరం లేదు.. ఉన్నంత కాలంలో సత్తా చాటితే చాలు. ఎన్ని ప్లాఫ్ ఇన్నింగ్స్ ఆడినా కానీ అసలు సిసలు మ్యాచ్ లో తన పవర్ చూపిస్తే చాలు. నిన్న మొన్నటి దాకా పేలవమైన ఆటతో విమర్శలపాలైన విరాట్ కోహ్లీ.. తిరిగి ఫాంలోకి వచ్చారు. బ్యాటింగ్ లో తన సత్తా ఏంటో చూపించి.. గ్రౌండ్ లో పరుగుల వరద పారించి.. కొత్త రికార్డులను సృష్టించారు. రాజ్‌కోట్‌ వన్డేలో హాఫ్‌ సెంచరీతో ఫామ్‌లోకొచ్చిన విరాట్‌ చెన్నై వన్డేలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంచనాలకు ఏ మాత్రం తగ్గంకుండా రాణించిన విరాట్‌ విమర్శలకు సెంచరీతోనే సమాధానమిచ్చాడు. ఈ మ్యాచ్‌ ఆరంభంలో ఆచితూచి ఆడిన డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాక స్పీడ్‌ పెంచాడు. ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అలరించిన విరాట్‌ క్రీజ్‌లో పాతుకుపోయాడు. పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో షాట్లు కొట్టి స్కోర్‌ బోర్డ్‌ను పరుగులు పెట్టించిన కొహ్లీ రహానే,రైనాలతో సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశాడు. ఫాంగిసో వేసిన 38వ ఓవర్‌ రెండో బంతికి లాంగ్‌ ఆన్‌ మీదుగా సిక్స్‌ కొట్టి తనదైన స్టైల్‌లోనే సెంచరీ పూర్తి చేశాడు.

112 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన విరాట్‌ ఆ తర్వాత కూడా అంతే దూకుడుగా ఆడాడు. 140 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ 165 వన్డేలు ఆడిన విరాట్‌కు ఇది కెరీర్‌లో 23వ సెంచరీ కావడం విశేషం.ఈ సెంచరీతో విరాట్‌ పలు రికార్డ్‌లు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో 5వ స్థానంలో నిలిచిన విరాట్‌ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో ఇప్పటివరకూ 22 సెంచరీలతో ఇప్పటివరకూ గంగూలీతో కలిసి రెండో స్థానాన్ని పంచుకున్న కొహ్లీ దాదాను వెనక్కునెట్టాడు. ఈ లిస్ట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ 49 సెంచరీలతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాదు వన్డే ఫార్మాట్‌లో టెస్ట్‌ హోదా కలిగిన అన్ని జట్లపై సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గానూ కొహ్లీ రికార్డులకెక్కాడు.సచిన్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా కొహ్లీ అరుదైన ఘనతను సొంతంచేసుకున్నాడు. 26 ఏళ్ల కొహ్లీ భవిష్యత్‌లోనూ వన్డేల్లో ఇదే జోరు కొనసాగిస్తే...మాస్టర్‌ సచిన్‌ 49 సెంచరీల రికార్డ్‌ను అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles