అదేంటి.. క్రికెట్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు కదా! ఇప్పుడు వీరబాదుడు బాదడం ఏంటి? అని అందరికీ సందేహం రాక తప్పదు. సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా.. ముందుగా హర్యానా క్రికెట్ సంఘానికి ఇచ్చిన మాట ప్రకారం అతగాడు తాజగా జరుగుతున్న రంజీ మ్యాచుల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగానే మైదానంలో దిగిన వీరు.. వీరబాదుడు బాదేసి సెంచరీ చేశాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వీరు సెంచరీ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
రంజీ ట్రోఫీ క్రికెట్ లీగ్ లో భాగంగా హరియాణా తరపున ఆడుతున్న సెహ్వాగ్.. కర్ణాటకపై సెంచరీ నమోదు చేశాడు. మైసూర్ లో గురువారం కర్ణాటక-హరియాణాల మధ్య ఆరంభమైన మ్యాచ్ లో వీరూ (136; 170 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్ లు) తనదైన ఆటతీరుతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో 80.00 స్ట్రైక్ రేట్ తో సెహ్వాగ్ ఆకట్టుకున్నాడు. ఇతను సెంచరీ చేయడంతో మైదనంలో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా చప్పట్లతో హెరెత్తించారు. ‘సెహ్వాగ్.. సెహ్వాగ్’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అటు క్రికెట్ ప్రముఖులు సైతం వీరూ సెంచరీ చేయడంపై పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. ఈ విధమైన ఆటతీరును రిటైర్మెంట్ ప్రకటించకముందు టీమిండియాలో కొనసాగించివుంటే చాలా బాగుండేదని, అతని కెరీర్ ఇంకా ముందుకు కొనసాగేదన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే.. ఇప్పుడు అలా అనుకోవడంలో ఏమాత్రం లాభం లేదని, ప్రస్తుతం అతని చేసిన సెంచరీని ఎంజాయ్ చేస్తూ సంతృప్తి చెందాల్సిందేనని అనుకుంటున్నారు.
ఈ మ్యాచ్ సందర్భంగానే మరో ఆటగాడు జయంత్ యాదవ్(100) కూడా సెంచరీ నమోదు చేయడంతో హరియాణా తన తొలి ఇన్నింగ్స్ లో 90.1 ఓవర్లలో 331 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక 58.0ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సెహ్వాగ్ వీరబాదుడితో భారీ స్కోరు చేసిన హరియాణా కచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుందని ఆశిస్తున్నారు. ఏదేమైనా.. సెహ్వాగ్ తన బ్యాటింగ్ లో పవర్ ను మరోసారి రుచిచూపించి, ప్రేక్షకులను ఆనందపరిచాడని చెప్పుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more