Pacer Zaheer Khan announces international retirement

Zaheer khan retires from international cricket

India vs South Africa 2015,Indian Cricket,South Africa Cricket,MS Dhoni,AB de Villiers,Hashim Amla,David Miller,Quinton de Kock, team india, south africa, ab de viellers, second one day,Cricket

Zaheer Khan is set to announce his retirement from international cricket today, Indian Premier League chairman Rajeev Shukla tweeted on Thursday.

అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పిన జహీర్ ఖాన్

Posted: 10/15/2015 02:52 PM IST
Zaheer khan retires from international cricket

టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కు ఇవాళ వీడ్కోలు పలికాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు జహీర్ ఖాన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. అంతేకాదు రానున్న ఐపీఎల్ సీజన్ 9 తరువాత అందులోంచి కూడా వీడ్కోలు తీసుకోనున్నట్లు ట్విట్టర్ లో పేర్కోన్నాడు. అయితే ఇవాళ ఉదయన్నే జహీర్ రిటైర్ అవుతున్నాడన్న వార్త మీడియాలో చక్కర్లు కోట్టింది. ఇందుకు రాజీవ్ శుక్లా ట్విట్ కారణమైయ్యింది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి జహీర్ రిటైర్ అవుతున్నాడని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ముందుగా ట్వీట్  చేశారు.

'జహీర్ ఖాన్ ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ బాగా సాగాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ శుక్లా ట్విటర్ లో పోస్ట్ చేశారు. 2002 నుంచి జహీర్ ఖాన్ తన ఫేవరేట్ బౌలర్ అని పేర్కొన్నారు. ఐపీఎల్ లో అతడు ఆడతాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 37 ఏళ్ల జహీర్ ఖాన్ టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకభూమిక పోషించాడు. ఈ మెగా టోర్నిలో 21 వికెట్లు పడగొట్టి ఆఫ్రిదితో కలిసి టాప్ బౌలర్ గా నిలిచాడు. అయితే జహీర్ టీమిండియా తరపున వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ అడి సుమారుగా మూడేళ్లు గడుస్తుంది. అప్పటి నుంచి ఆయన తీవ్ర గాయాల బారిన పడి దేశవాళీ క్రికెట్ లో అడుతూ.. విశ్రాంతి తీసుకుంటూ గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ జహీర్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి.. ఆ తరువాత ఐసీఎల్ నుంచి కూడా తప్పుకోనున్నట్లు ఆయన సంకేతాలను ఇచ్చాడు.

పేస్ బౌలర్ గా జహీర్ సృష్టించిన మైలురాళ్లు..

  *  2000లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో అరంగ్రేటం చేశాడు
  *  200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు
  *  3 వన్డే వరల్డ్ కప్ లలో 23 మ్యాచ్ లు ఆడి 44 వికెట్లు తీశాడు
  *  92 టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు
  *  టెస్టుల్లో 11 సార్లు 5 వికెట్లు, ఒకసారి 10 వికెట్లు తీశాడు
  *  17 టి20 మ్యాచ్ లు ఆడి 17 వికెట్లు దక్కించుకున్నాడు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles