Zaheer Khan a 'Thinking Bowler', Say Sachin Tendulkar, Mahendra Singh Dhoni

Sachin tendulkar leads all the best zaheer khan wishes on twitter

Zaheer Khan, international cricket career, Sachin Tendulkar, MS Dhoni, BCCI, India,Sachin Ramesh Tendulkar,MS Dhoni,Zaheer Khan,BCCI,Cricket Zaheer Khan a 'Thinking Bowler', Say Sachin Tendulkar, Mahendra Singh Dhoni latest Cricket news, IPL, Rajiv shukla, team india, south africa, ab de viellers,Cricket

Sachin Tendulkar said Zaheer Khan was an intelligent bowler who had the capability to out-think batsmen. Mahendra Singh Dhoni called the left-arm pacer a clever bowler.

పేసర్ జహీర్ ఖాన్ కు అల్ ది బెస్ట్ ల వెల్లువ

Posted: 10/15/2015 04:37 PM IST
Sachin tendulkar leads all the best zaheer khan wishes on twitter

గత రెండు మూడేళ్లుగా గాయాలతో బాధపడుతూ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరంగా వున్న ఇండియన్ సీనియర్ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ఇవాళ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో ఆయన అటు బిసిసిఐ ప్రముఖుల నుంచి ఇటు టీమిండియా జట్టు సభ్యుల నుంచి.. ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రికెటర్లతో పాటు అభిమానుల నుంచి కూడా అల్ ది బెస్ట్ అంటూ అభినందనలు వెల్లివిరిసాయి. అభిమానులతో పాటు క్రికెట్ దిగ్గజాలు ఆయనకు సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా అనేక మంది ఆయనకు అల్ ది బెస్ట్ విషెస్ ను తెలిపారు.

తనకు తెలిసిన కూలెస్ట్ పేస్ బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. సవాల్ ను స్వీకరించడంలో అతడెప్పుడూ ముందుండే వాడని తెలిపాడు. చాలా సందర్భాల్లో బ్యాట్స్ మెన్ పై అతడు పైచేయి సాధించాడని గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్ లో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న జహీర్ ఖాన్.. ఇందులోనూ విజయవంతం అవుతాడని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ బాగా సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు.


ఇక టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఆయన శుభాకాంక్షఃలు తెలిపారు. జహీర్ ఖాన్ లేకుండా తాను కెప్టెన్ గా టీమిండియా సాధించిన అనేక మైలురాళ్లు సాధ్యమయ్యేవి కాదన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జహీర్ బౌలింగ్ లో సచిన్ లాంటి దిగ్గజమని కొనియాడారు. తనకు తెలిసిన తెలివైన, చురుకైన పేస్ బౌలర్లని చెప్పుకోచ్చాడు, జీవితం ఇప్పుడే ప్రారంభమైందని, జహీర్ ఇండియన్ క్రికెట్ కోసం మరింతగా పాటుపడాల్సిన అవశ్యకత వుందని పేర్కోంటూ ట్విట్ చేశాడు. అటు ఇండియన్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా కూడా జహీర్ ఖాన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జహీర్ తనకు పెద్దన్న లాంటి వాడని కొనియాడారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zaheer Khan  Sachin Tendulkar  MS Dhoni  Suresh raina  BCCI  Cricket news  

Other Articles