ab de viellers credits team india for the match win

Credit to india for pulling it off de villiers

India vs South Africa 2015,Indian Cricket,South Africa Cricket,MS Dhoni,AB de Villiers,Hashim Amla,David Miller,Quinton de Kock, team india, south africa, ab de viellers, second one day,Cricket

South Africa captain AB de Villiers blamed his batting unit for their 22-run defeat to India in the second cricket ODI

అది ధోని సేన సమిష్టి విజయ ఫలితం

Posted: 10/15/2015 01:49 PM IST
Credit to india for pulling it off de villiers

ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ధోని సేన సమిష్టి కృషి ఫలితంగానే విజయాన్ని నమోదు చేసుకుందని దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఏబి డెవిలియర్స్ అన్నాడు. టీమిండియా - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ వన్డే మ్యాచ్ చివరి ఓవర్లు చూసిన వాళ్లెవరూ ఆ గేమ్ను మర్చిపోలేరని అభిప్రాయపడ్డారు. ఒక బ్యాట్స్మన్ విధ్వంసం సృష్టిస్తుంటే.. కాసేపటికల్లా ఓ బౌలర్ రెచ్చిపోయి వికెట్లు తీస్తున్నాడు. మళ్లీ కాసేపటికే రబడా లాంటి టెయిలెండర్లు కూడా బౌండరీలు బాదేస్తుంటే... అంతలోనే మళ్లీ భువనేశ్వర్ కుమార్ జూలు విదిల్చి టపటపా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతే, మ్యాచ్ టీమిండియా వశమైపోయింది.

కళ్లెదుటే కనపడుతున్న ఈ అద్భుతం నాకు నోట మాట రాలేదని ఏబి డెవిలియర్స్ అన్నాడు. తమ చేతుల్లోనే ఉన్న మ్యాచ్ని ఇండియా తమ చేతుల్లోకి లాగేసుకుందని అన్నాడు. ధోని సేన అద్భుతంగా ఆడటంతో పాటు సమిష్టిగా రాణించడంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. అయితే మ్యాచ్ ఓటమికి మరో కారణం.. తమ వాళ్ల బ్యాటింగ్ అని..  ఏమాత్రం కుదురుగా, నిలకడగా రాణించలేకపోడమేనని చెప్పుకొచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, కేవలం 247 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదికూడా సారథి ధోనీ 92 పరుగులు చేసి నాటౌట్గా మిగలడం వల్లే. స్వల్ప స్కోరును చేధించేందుకు బరిలో దిగిన తమ బ్యాట్స్ మెన్లు చతికిల పడటంతో.. వారిని విజయం వరించిందన్నాడు.

ఈ క్రెడిట్ చాలావరకు ఇండియాకే దక్కాలని మ్యాచ్ తర్వాత ఏబీ వ్యాఖ్యానించాడు. వాస్తవానికి తమ ఎదుట ఉన్న లక్ష్యం చిన్నదేనని, అయితే ఓపెనింగ్ భాగస్వామ్యం బాగున్నా దాన్ని నిలబెట్టుకోవడం తమవాళ్లకు చేతకాలేదని ఒప్పుకొన్నాడు. ఛేజింగ్ చేసేటప్పుడు కాస్త పాజిటివ్గా ఉండాలని, కానీ తాము మాత్రం అలా ఉండలేకపోయామని చెప్పాడు. తమ బౌలర్లు చాలా బాగా పెర్ఫామ్ చేయడం వల్లే టీమిండియాను కట్టడి చేయగలిగామని, అయితే బ్యాట్స్మన్ వైఫల్యం విజయాన్ని తమకు అందకుండా చేసిందని అన్నాడు. ఇక తన వెన్నెముక గాయం పెద్దదేమీ కాదని, తదుపరి మ్యాచ్ నాటికి పూర్తి సిద్ధంగా ఉంటానని తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  south africa  ab de viellers  second one day  

Other Articles