Cheteshwar Pujara Joins Sunil Gavaskar, Virender Sehwag and Rahul Dravid in Elite List

Cheteshwar pujara enters elite group after unbeaten 145

cheteshwar pujara, cheteshwar pujara india, india cheteshwar pujara, indian opener, team india, not out innings, Rahul Dravid, Virender Sehwag, elite list, Sunil Gavaskar, cheteshwar pujara india sri lanka, sri lanka india, cricket news, cricket

Cheteshwar Pujara became only the fourth Indian player to carry his bat in Test match cricket.

దిగ్గజ త్రయం సరసన చేరిన పుజారా

Posted: 08/30/2015 06:36 PM IST
Cheteshwar pujara enters elite group after unbeaten 145

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారతీయ యువ క్రికెటర్ చతేశ్వర్ పూజరా భారత దిగ్గజ త్రయం సరసన చేరాడు. తొలిఇన్నింగ్స్ లో భారత్ 100.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. 292/8 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి సేన మరో 20 పరుగులు జత చేసి మిగతా 2 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన శతకం వీరుడు చతేశ్వర్ పుజారా తొలి ఇన్నింగ్స్ లో నాటౌట్ గా నిలిచి దిగ్గజాల జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు.

ఓపెనర్ గా వచ్చిన పుజారా కీలక ఇన్నింగ్స్ తో భారత జట్టును స్కోరును గౌరవప్రదమైన స్థాయికి తీసుకువచ్చి ఆదుకోవడమే కాకుంగా చివరివరకు అజేయంగా నిలిచాడు. దీంతో ఇంతకు ముందు ఈ అరుదైన ఫీటును సాధించిన భారత క్రికెటర్లు సునిల్ మనోహర్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్  ద్రావిడ్ ల సరసన స్థానం సంపాదించాడు. లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని కడ వరకు బ్యాటింగ్ కొనసాగించాడు. శ్రీలంక బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు. 100 ఓవర్ల పాటు అతడు క్రీజులో ఉన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheteshwar pujara  indian opener  team india  not out innings  

Other Articles