Ashes 2015: England retake Ashes after mauling Australia by an innings and 78 runs

England beats australia in fourth test won the series by 3 1

ashes 2015, ashes, the ashes, the ashes 2015, ashes england 2015, ashes australia 2015, ashes australia squad, ashes england squad, england ashes team, australia ashes team, ashes england cricket team, ashes australia cricket team, england, australia, ashesseries 2015, ashes tour 2015, ashes tour australia 2015, ashes tour england 2015, Stuart Broad,Trent Bridge, Nottingham,The Ashes 2015,Cricket The Ashes: Stuart Broad's Best Test Figures, Australia Out For 60 latest The Ashes 2015 news

England defeated Australia comprehensively to retake the Ashes after a gap of two years.

మరో టెస్టు మ్యాచ్ మిగిలుండగానే యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్ వశం

Posted: 08/08/2015 06:36 PM IST
England beats australia in fourth test won the series by 3 1

ఇంగ్లాండ్ ప్రతిష్మాత్మకమైన యాషెస్ సిరీస్ ను కైవసం చేసుకుంది. రెండేళ్ల తరువాత ఈ టైటిల్ ను తిరిగి సాధించుకుంది. ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో పేలవమైన ప్రధర్శనతో క్వార్టర్స్ చేరకుండానే వెనుదిరిగిన జట్టు.. యాషెస్ సిరీస్ లో అధ్బుతమైన ఆటతీరుతో కంగారులను కంగారుపెట్టించింది. సొంతగడ్డ నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన నాల్గవ టెస్టులో విజయం సాధించి.. మరో టెస్టు మ్యాచ్ మిగిలివుండగానే.. సిరీస్ ను కైవసం చేసుకుంది. యాషస్ సిరీస్ ను సమం చేయాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కంగారులకు ఇంగ్లాండ్ బౌలర్ సువర్ట్ బ్రాడ్ ముచ్చెటలు పట్టాంచాడు.

తన కెరిర్ బెస్ట్ గా నిలిచే స్కోరును సొంత చేసుకున్న బ్రాడ్, 15 పరుగులు ఇచ్చి ఎనమిది వికెట్లను పడగోట్టాడు. నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఓటమి చెందడంతో సిరీస్ ను ఇంగ్లండ్ చేజిక్కించుకుంది. మూడో రోజు 241/7 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మరో 12 పరుగులు మాత్రమే చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయింది.  దీంతో  3-1 తేడాతో సిరీస్ ను గెలిచిన ఇంగ్లండ్ .. ఒక టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకుని గత యాషెస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

నాల్గవ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 60 పరుగులకే చాపచుట్టేసిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్ లో కాస్త ఫర్వాలేదనిపించింది. రోజర్స్(52), డేవిడ్ వార్నర్(64), వోజస్(51) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ను 253 పరుగుల వద్ద ముగించింది.  ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఆరు వికెట్లు తీసి ఆసీస్ రెండో ఇన్నింగ్స్ కు కట్టడి చేసి విజయం కీలక పాత్ర పోషించాడు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్ కు ఈ ఇన్నింగ్స్ లో ఒక వికెట్ లభించింది. ఆస్ట్రేలియా  తొలి ఇన్నింగ్స్ 60 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్  253 ఆలౌట్, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్.. 391/1 డిక్లేర్డ్.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashes 2015  Australia  ENG vs AUS  England  England VS Australia  

Other Articles