Inzamam asks PCB to organise tours against Australia, England, India

Play india to perform under pressure inzamam

Play India to perform under pressure: Inzamam, islamabad, inzamam, ul, haq, pakistan cricket board, pcb, australia, england, south africa, india, pakistan cricketer, india series, former pakistan captain

Batting great Inzamam-ul-Haq says if Pakistani cricketers have to learn performing under pressure, they must play arch-rival India on a regular basis.

ఒఃత్తిడిని జయించడానికి ఇదే చక్కటి మార్గం

Posted: 08/07/2015 06:28 PM IST
Play india to perform under pressure inzamam

ఒత్తిడిలో రాణించాలంటే కేవలం కఠోర శిక్షణ ఓక్కటే సరిపోదని, దానిని అదిగమించేందుకు ధీటైన ప్రత్యర్థి జట్టుతో అధిక మ్యాచ్‌లు అడటం ఒక్కటే మార్గంగా చెప్పుకోచ్చారు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెస్టెన్ ఇంజమామ్ ఉల్ హక్. ఒత్తిడిలో కూడా చక్కటి ప్రదర్శన చేయాలంటే ముఖ్యంగా భారత్‌తో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని ఆయన పాకిస్తాన్ దేశ క్రికెటర్లకు సూచించాడు. భారత్‌తో రెగ్యులర్‌గా సిరీస్‌లు ఏర్పాటు చేయాలని పీసీబీని కోరాడు. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా టూర్లను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. తాము ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు కష్టపడ్డాం. అయితే ఒత్తిడిలో ఎలా ఆడాలో ఆయా జట్లతో ఆడినప్పుడు నేర్చుకున్నామన్ని చెప్పాడు.

ప్రస్తుత క్రికెటర్లు ఒత్తిడిలో ఆడాలంటే ఉన్న చక్కటి అవకాశం రెగ్యులర్‌గా భారత్‌తో మ్యాచ్‌లు ఆడడమే' అని వ్యాఖ్యానించాడు. భారత్-పాక్ మధ్య సిరీస్ జరిగితే చూడాలని ఉందన్నాడు. భారత్‌తో ఎక్కడ ఆడామనేది కాకుండా, రెగ్యులర్‌గా ఆడితే లాభం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తమ క్రికెట్‌లో ఉన్న రాజకీయాలను తట్టుకొని కూడా యూనిస్ ఖాన్ ఆటపై దృష్టిపెడుతున్నాడని మెచ్చుకున్నాడు. పాక్ తరఫున  టెస్టుల్లో పది వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాలని ఆకాంక్షించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : inzamam ul haq  pakistan cricketer  india series  former pakistan captain  

Other Articles