australias clarke set to retire from Test cricket

Ashes 2015 michael clarke to retire from test cricket

Michael Clarke to retire from Test cricket, michael clarke, michael clarke resigns, Test cricket, michael clarke future, michael clarke retirement, ashes 2015, ashes series, the ashes, Former England captain Michael Vaughan

The first casualty of Australia's disastrous Ashes campaign in England has emerged, with beleaguered captain Michael Clarke to retire at the end of the series.

టెస్టు మ్యాచ్ లకు మైకిల్ క్లార్క్ గుడ్ బై

Posted: 08/08/2015 06:39 PM IST
Ashes 2015 michael clarke to retire from test cricket

యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు పేలవ ప్రదర్శనకు నైతిక బాద్యత వహించిన జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ గుడ్ బై చెప్పనున్నారు. ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న ఆయన టెస్టు క్రికెట్కు వీడ్కోలు చెప్పనున్నాడు. యాషెస్ సిరీస్ తర్వాత 34 ఏళ్ల క్లార్క్ టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. యాషెస్ చివరి టెస్టు తర్వాత రిటైరవుతున్నట్టు క్లార్క్ ఓ ఆస్ట్రేలియా పత్రికలో రాసిన ఓ వ్యాసంలో పేర్కొన్నాడు.  క్లార్క్ సుధీర్ఘకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.  గాయాల కారణంగా బ్యాటింగ్లో రాణించలేకపోతున్నాడు. దీనికి తోడు యాషెస్ సిరీస్ పరాజయం అతనిపై ప్రభావం చూపినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా ఘోర ఓటమి పాలైంది. శనివారం ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్  తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్లో నామమాత్రమైన చివరి, ఐదో టెస్టు ఈ నెల 20న ఓవల్ లో ప్రారంభం కానుంది. క్లార్క్కు ఇదే చివరి టెస్టు కావచ్చు. 2004లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన క్లార్క్ తన కెరీర్లో 114 మ్యాచ్లు ఆడాడు. 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 8605 పరుగులు చేసిన క్లార్క్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 329 (నాటౌట్)గా నమోదు చేసుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : michael clarke  retirement  Test cricket  ashes 2015  

Other Articles