Shashank Manohar calls for CBI probe after IPL betting mess

Bcci took no action to clean up ipl mess shashank manohar

BCCI, N Srinivasan, IPL, Shashank Manohar, BCCI took no action to clean up IPL mess, Shashank Manohar, Shashank Manohar on IPL mess, Shashank Manohar on srinivasan, Shashank Manohar on cricket, Former BCCI president Shashank Manohar, Shashank Manohar calls for cbi probe, Shashank Manohar on ipl betting mess,

Former BCCI president Shashank Manohar today said that the Board did not take any timely steps to clean up the mess in the IPL and now it has no choice but to comply with Lodha Committee's recommendations.

ఐపీఎల్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలి

Posted: 07/18/2015 10:32 PM IST
Bcci took no action to clean up ipl mess shashank manohar

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ డిమాండ్ చేశారు. 2013 నుంచి ఫిక్సింగ్ దోషులపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మనోహర్ ఆరోపించారు. ఈ అంశంపై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన బీసీసీఐలో జరుగుతున్న అవినీతిపై ఘటు విమర్శలు గుప్పించారు. ఐపీఎల్‌ సీవోవో పదవి నుంచి సుందరరామన్‌ తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఐపీఎల్ ను కాసులు కురిపించే ఆటగా మాత్రమే చూడటం.. ఆటగాళ్ల క్రీడాస్పూర్తికి విరుద్దమని చెప్పారు.

మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌పై కూడా మనోహర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2013లో తొలిసారి స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చాక శ్రీనివాసన్ ప్రతిష్ఠ దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. ఐసీసీ చైర్మన్ పదవికి శ్రీనివాసన్ అర్హుడు కాదని ఆయన విమర్శించారు. తక్షణం శ్రీనివాసన్ ను, ఆ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో సుప్రీం కోర్టు నియమించిన లోథా కమిటీ ఐసీపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ ఫ్రాంచైజీస్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shashank Manohar  BCCI  N Srinivasan  IPL  

Other Articles