cheating case filed against former cricketer arshad ayub

Court orders police to file case against hyderabadi cricketer

court orders police to file case against hyderabadi cricketer, cheating case filed against former cricketer arshad ayub, miyapur court, legendary indian cricketer arshad ayub, cheating case, miyapur police, former cricketer

miyapur court orders local police to file a case against legendary indian cricketer arshad ayub in cheating case

హైదరాబాదీ క్రికెటర్ పై చీటింగ్ కేసు నమోదు

Posted: 07/18/2015 08:29 PM IST
Court orders police to file case against hyderabadi cricketer

టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మళ్లీ ఇన్నాళ్లకు వార్తల్లోని వ్యక్తిగా మారాడు. మరో పదవిని అలంకరిస్తూ ఆయన వార్తల్లో నిలువలేదు. తమను మోసం చేశాడని బాధితులు అరోపించడంతో ఆయన చీటింగ్ కేసులో నిందితుడిగా వార్తల్లోకి ఎక్కడు. అర్షద్ అయూబ్ పై మింమాపూర్ పోలిసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అర్షద్ అయూబ్ మరికోందరితో కలసి స్కైటీ పేరుతో అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టి వాటని పలువురికి విక్రయించేందుకు ఒప్పందం కుదర్చుకున్నారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే వుంది అసలు ట్విస్టు.

2007లో ప్రారంభించిన ఈ వెంచర్ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో పీజీకే నాయర్ అనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కోర్టను ఆశ్రయించాడు. దీంతో న్యాయస్థానం అర్షద్ అయూబ్ సహా బిల్డర్లపై కేసులు నమోదు చేయాలని మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. కోర్టు అదేశాల మేరకు మియాపూర్ పోలీసులు ఆర్షద్ అయూబ్ పై ఐపీసీ 406, 409, 415, 420, 464, 468, 470, 471, 506 రీడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 20 నెలల్లోపు పూర్తి చేస్తామని కొనుగోలుదార్ల నుండి డబ్బులు తీసుకున్న అయూబ్ ఐదేళ్లయినా పని పూర్తి చేయాలేదని నాయర్ పిర్యాదు చేశారు. నాయర్ తరహాలో మరో ఏడుగురు అయూబ్ చేతిలో మోసపోయామని మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. కాగా అర్షద్ అయూబ్ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో వున్నారని, అతను వచ్చిన తరువాత అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheating case  former cricketer  arshad ayub  miyapur police  

Other Articles