Axar's Three on Debut Destroys Zimbabwe

Patel harbhajan spin india to comprehensive win against zimbabwe

Zimbabwe, 1st T20, India, India vs Zimbabwe, T20, Cricket, murali vijay, akinya rahane, india tour of zimbabwe 2015, Team india, Stuart Binny, rayudu and binny partnership, india vs zimbabwe, india vs zimbabwe 2015, zimbabwe, zimbabwe vs india, zimbabwe vs india 2015, ind vs zim, ind vs zim 2015, Ambati Rayudu, Elton Chigumbura, Stuart Binny, Zimbabwe, Zimbabwe vs India, Zimbabwe vs India 2015, Kedar Jadhav, Manish Pandey, Whitewash, Zimbabwe

Young Axar Patel and Harbhajan Singh gave an impressive display of spin bowling as India relied on an all-round display to trounce a hapless Zimbabwe by 54 runs in the first T20 International cricket match

తొలి టీ-20లో సత్తా చాటిని టీమిండియా..

Posted: 07/17/2015 11:49 PM IST
Patel harbhajan spin india to comprehensive win against zimbabwe

జింబాబ్వే జట్టుతో హరారే వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో భారత్ తన దూకుడును ప్రదర్శించింది. అధిత్య జట్టుపై విజయాన్ని కైవసం చేసుకుంది. వన్డే సీరిస్ ను కోల్పోయిన జింబాబ్వే జట్టు కనీసం టీ-20 సీరిస్ నైనా గెలిచి పరువు దక్కించుకోవాలని యత్నించగా.. దానిని కూడా రహానే సేన పటాపంచలు చేస్తూ తొలి టీ-20లో 54 పరుగులతో విజయాన్ని నమోదు చేసుకుంది. ముందుగా టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో  178 పరుగులు చేసింది.

భారత్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే చతికిల పడింది. కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లుగా దిగిన మసకడ్జ(28), ఛిబాబా(23)లు కాస్త ధాటిగా ఆడి మెరుపులు మెరిపించారు. ఆ తర్వాత టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు క్రమంగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కవొంట్రీ 10, చిగుంబుర 1, రజా 10, ఎర్విన్ 2, క్రెమెర్ 9 పరుగులకే వికెట్లు పారేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఉట్సెయ(14), మడ్జివ(14) ఫోర్లు, సిక్సర్లు కొట్టినా అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లు పూర్తి అయ్యేసరికి జింబాబ్వే.. ఏడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దీంతో 54 పరుగుల తేడాతో టీంఇండియా విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు, హర్భజన్ సింగ్ రెండు, మోహిత్ శర్మ ఒక్క వికెట్ తీసుకున్నారు.

మొదట బ్యాటింగ్‌ చేసిన టీంఇండియా ఓపెనర్లు రహానే, విజయ్‌ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించిన తర్వాత విజయ్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అవ్వగా, , కాసేపటికే రహానే 33 పరుగుల వద్ద ఔటయ్యారు. ఆ తరువాత వరుసగా మూడు వవికెట్లు కొల్పియినా టీమిండియాలో.. వన్డేలలో రాణించలేదని విమర్శలను ఎదుర్కోన్న మిడిల్‌ అర్డర్‌ బ్యాట్స్ మెన్ లో రాబిన్ ఊతప్ప నిలకడి నాటౌట్ గా నిలచి 39 పరుగులు చేశారు. దీంతో టీమిండియా పటిష్టమైన స్కోరును చేయగలిగింది. జింబాబ్వే బౌలరల్లో క్రిస్ మోఫు మూడు, గ్రేమీ క్రీమర్ ఒక్క వికెట్ తీసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zimbabwe  1st T20  India  India vs Zimbabwe  T20  Cricket  

Other Articles