Test Team For Tour of Sri Lanka to be Announced Next Week

Indian squad for sri lanka tour to be picked on july 23

India vs sri lanka, indian squad, july 23, Virat Kohli, Shikhar Dhawan, Rohit Sharma, Harbhajan Singh, Kedar jadhav, manish pandey, india, murali vijay, akinya rahane, india tour of sri lanka 2015, Team india, Stuart Binny, ambati rayudu, india vs sri lanka 2015, Ambati Rayudu, Stuart Binny, srilanka vs India 2015, Kedar Jadhav, Manish Pandey, Whitewash, Zimbabwe, sandeep patil, india squad, india squad sri lanka, sri lanka india squad, india tour of sri lanka, indvsri, sri lanka vs india, india virat kohloi, virat kohli india, cricket news, cricket

Top Indian players Virat Kohli, Shikhar Dhawan and Rohit Sharma are expected to be part of India's tour of Sri Lanka next month as the selectors will meet on 23 July to pick the team

శ్రీలంక టూర్ కు 23న భారత జట్టు ఎంపిక

Posted: 07/16/2015 06:17 PM IST
Indian squad for sri lanka tour to be picked on july 23

జింబాబ్వే పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసిన తరుణంలో శ్రీలంక పర్యటనలో జరగనున్న టెస్టు సీరీస్ కు బిసిసిఐ ఈ నెల 23న జట్టు సభ్యలను ప్రకటించనుంది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకోసం ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం కానుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా పూర్తి స్థాయిలో జట్టును ఈ సిరీస్ లో బరిలోకి దిగే అవకాశం వుంది. శ్రీలంతో సీరీస్ లో భాగంగా భారత జట్టు మూడు టెస్టులను అడనుంది. ఆగస్టు 12న తొలి టెస్టు గాలేలో ప్రారంభం కానుండగా, రెండవ టెస్టు 20 నుంచి 24 వరకు , మూడవ టెస్టు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు కొలంబోలోని ఎస్ ఎస్ సి లో జరగనున్నాయి.

ఇందుకోసం ఈ నెల మూడున భారత జట్టు శ్రీలంక కు చేరుకుని వార్మ్ అప్ మ్యాచ్ లను ప్రాక్టీసు చేయనుంది. సెప్టెంబర్ 2న భారత జట్టు తిరిగి స్వదేశానికి చేరుకోనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు శిఖార్ ధావన్, రోహిత్ వర్మ, అజింక్యా రహానేలతో పాటు మరెవరికి స్థానం లభించనుందో..? చాలా కాలం తరువాత టీమిండియాలో చేరిన హర్భజన్ సింగ్ తన స్థానాన్ని పధిలపర్చుకుంటాడా..? లేదా అన్నది కూడా తేలాల్సి వుంది. జింబాబ్వే పర్యటనలో సీనియర్లు లేకుండానే బరిలో దిగిన భారత్ జట్టు క్లీన్ స్వీప్ చేయడంతో దోహదపడిన తెలుగుతేజం అంబటి రాయుడు, బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ ప్రతిభ కనబర్చని స్టవర్ట్ బిన్ని, కేదార్ జాదవ్, మనీష్ పాండేలకు కూడా ఈ తుది జాబితాలో స్థానం లభిస్తుందా..? లేదా అన్న అంశాన్ని వేచి చూడాల్సిందే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  srilanka  virat kohli  test squad  sandeep patil  

Other Articles