England's secret weapon for second test against austraila at lord's

Sachin tendulkars son arjun at lords how the english media reacted

sachin tendulkar, sachin tendulkar arjun, arjun sachin tendulkar, arjun tendulkar, cricket arjun tendulkar, arjun tendulkar lords, lords cricket ground, lords ground, English media, England's secret weapon, Australia, reaction, cricket news, cricket

The English media termed Arjun Tendulkar to be 'England's secret weapon against Australia at Lord's'.

అస్ట్రేలియాపై సంధించేందుకు ఇంగ్లాండ్ రహస్య అస్త్రం అర్జున్ టెండుల్కర్

Posted: 07/16/2015 06:08 PM IST
Sachin tendulkars son arjun at lords how the english media reacted

భారత క్రికెట్ లెజండ్ సచిన టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఇంగ్లాండ్ లోని లార్డ్స్ స్టేడియంలో మెరిశాడు. అర్రె మన యువ ఆశాకిరణం అక్కడేం చేస్తున్నాడు అనుకుంటున్నారా..? ఇంగ్లాండ్ లో లార్డ్స్ గ్రౌండ్ లో అక్కడి ఆటగాళ్లకు బంతులు విసిరాడు. అదెట్టా..? అంటారా..? ఇంగ్లాండ్ పర్యటనకు కుటుంబంతో సహా వెళ్లిన సచిన్.. అక్కడ తన తనయుడి ఆసక్తి మేరకు ప్రపంచ ప్రాముఖ్యత సంతరించుకున్న లార్డ్స్ క్రికెట్ గౌండ్ర్స్ లోకి వెళ్లిన అక్కడ ఆటగాళ్లు నెట్ లో ప్రాక్టీసు చేయడంతో తన తనయుడిని వారికి బంతులు విసరాల్సిందిగా చెప్పాడు.

అంతే అర్జున్ టెండుల్కర్ బంతిని అందిపుచ్చుకుని తన ప్రతిభను కనబర్చాడు. అస్ట్రేలియాతో రెండో టెస్టుకు సిద్దమవుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లకు బంతులు వేసి తన ప్రతిభను చూపాడు. అంతేకాదు ఇంగ్లాండ్ బౌలింగ్ కోచ్ ఒట్టిస్ గిబ్సన్ నుంచి కూడా బౌలింగ్ పై మెలకువలను తెలుసుకున్నాడు. అయితే దీనిపై భారత్ మీడియా ఎంతో ఉత్కంఠను ప్రదర్శించి కథనాలను ప్రసారం చేసింది. కాగా ఇంగ్లీష్ మీడియా దీనిపై స్పందించిన తీరు కాస్త భిన్నంగా వుంది. డైయిలీ మెయిల్, గార్డియన్ లాంటి దిగ్గజ ప్రతికలు ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు అన్న అంశాలతో స్పందించగా, టెలిగ్రాఫ్ మాత్రం తద్బిన్న కథనాన్ని ప్రచురించింది.

అస్ట్రేలియాతో జరిగనున్న రెండో టెస్టుకు ఇంగ్లాండ్ రహస్య అస్త్రంగా అర్జున్ ప్రయోగించనున్నందన కథనం అందరినీ ఆకర్షించింది. అర్జున్ అక్కడ వుండటం వల్ల ఇద్దరు బౌలర్లు మైఖిల్ జాన్సన్, మైఖిల్ సార్క్ లకు లాభం చేకూరుతుందని పేర్కోంది. కాగా సచిన్ టెండుల్కర్ స్వయంగా తన తనయుడు అర్జున్ టెండుల్కర్ ఇంగ్లాండ్ లో బౌలింగ్ చేసిన విషయాన్ని తన అభిమానులతో ట్విట్టర్ ద్వార పంచుకుని అనందానుభూతిని పోందుతున్నాడు. మరి ఈ ఆటగాడు జట్టులోకి ఎప్పడు వస్తాడో..? తన ప్రతిభను దేశానికి ఎప్పుడు వినియోగిస్తాడో వేచి చూడాల్సిందే మరి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arjun sachin tendulkar  English media  England's secret weapon  Australia  reaction  

Other Articles