Bangladesh Beat South Africa by 9 Wickets, Claim 4th Successive Home Series

Bangladesh register historic odi series win over south africa

bangladesh vs south africa, ban vs sa, sa vs ban, south africa, bangladesh, south africa vs bangladesh, bangladesh cricket team, south africa cricket team, Soumya Sarkar, Hashim Amla, Bangladesh vs South Africa, Bangladesh, cricket news, cricket

Bangladesh’s fourth successive home ODI series victory underlines their growing stature in 50-over cricket.

సఫారీలకు బంగ్లా షాక్.. వరుసగా 4వ సీరీస్ కైవసం

Posted: 07/16/2015 06:21 PM IST
Bangladesh register historic odi series win over south africa

వారిని ఇప్పుడు పసికూనలు అనడానికి వీలు లేదు. ఎందుకంటారా..? హోమ్ టౌన్ లో జరుగుతున్న సీరీస్ లను కైవసం చేసుకోవడం ఇప్పుడు వారికి పరిపాటిగా మారింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు వరస సీరీస్ లను వారు కైవసం చేసుకున్నారు. ఏదో చిన్నా చితకా జట్లపై ఆడటం కూడా ఒక ఆటేనా అంటూ వారితో సిరీస్ లకు మొగ్గుచూపే దేశాలపై వెల్లువెత్తిన విమర్శలను వరుస విజయాలతో వారు విమర్శలకులకు సమాధానాలను ఇచ్చారు. ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ దేశాలుగా నమోదయిన పాకిస్థాన్, భారత్ సహా దక్షిణాఫ్రికా దేశాలను ఖంగు తినిపించారు. ఇంతకీ వారెవరంటున్నారా..? వారే బంగ్లాదేశ్. క్రికెట్ జట్టు. పసికూనలు కాదు వారు కసి కూనలు.. పులి కూనలు అంటూ విమర్శకుల పొడగ్తలను అందుకుంటున్నారు.

తొలిసారిగా ఈ ఏడాది జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో సెమీస్ వరకు వెళ్లి.. వెనుదిరిగిన బంగ్లాదేశ్ ముందుగా పాకిస్థాన్ తో జరిగిన సీరీస్ ను కైవసం చేసుకున్న బంగ్లా దేశ్..  ఆ తరువాత షాట్ సిరీస్ తో వెళ్లిన టీమిండియాను కూడా మట్టికరిపించారు. ఇప్పడు తాజాగా సౌత్ ఆఫ్రికాను కూడా ఖంగుతినిపించి కొలుకోలేని షాక్ ఇచ్చిరు. మూడు వన్డేల సీరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన సఫారీలతో జరిగిన మ్యాచ్ లో తొలి వన్డేలో పరాజయం పాలైన బంగ్లా.. ఆ తరువాత కొలుకుని వరుసగా రెండు వన్డేలను కైవసం చేసుకుని వరుసగా నాల్గవ వన్డే సిరీస్ ను సొంతం చేసుకున్నారు.

నిన్న జరిగిన చివరి వన్డేలో నిర్ణీత యాబై ఒవర్ల మ్యాచ్ ను వర్షం కారణంగా కేవలం నలభై ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది. సపారీలలో డేవిడ్ మిల్లర్, డుమిని తప్ప ఎవరూ రాణించలేదు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ మూడు, రహామాన్, రుబిల్ హోస్సెన్ చెరో రెండు వికెట్లు, మొర్తజా మరో విక్కట్ తీసుకున్నారు. కాగా సపారీలు నిర్ధేశించిన టార్గెట్ ను చేధించే క్రమంలో బరిలోకి దిగిన బంగ్లా ఓపెనర్లు మంచి బాఘస్వామ్యాన్ని నెలకోల్పడంతో బంగ్లా ఇంకా 14 ఓవర్లు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది. తమీమ్ ఇక్బాల్ 61, సౌమ్యసర్కార్ 90 పరుగులతో రాణించారు. దీంతో బంగ్లాదేశ్ సపారీలకు షాక్ ఇచ్చి సిరీస్ ను సొంతం చేసుకుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Africa  Soumya Sarkar  Hashim Amla  Bangladesh vs South Africa  Bangladesh  

Other Articles