MS Dhoni satisfied with Ravichandran Ashwin and Ravindra Jadeja’s progress

Ms dhoni satisfied with spin duo s progress

teamindia, bangladesh, MS dhoni, Ravichandran Ashwin, Ravindra jadejaBangladesh, Team India, MS dhoni, Virat Kohli, Ind vs Ban, 2015, Cricket, Ind vs Ban 2015 news, teamindia, bangladesh, first one day, Sher-e-Bangla National Stadium, Mirpur bangladesh, Sports, Shikhar Dhawan, murali vijay, Ajinkya Rahane, Sher-e-Banglam harbajan singh, MS Dhoni, Richest athletes, cricket, Cricketer Mahendra Singh Dhoni, Former selector Raja Venkat, captaincy, india tour of bangladesh 2015, Ravichandran Ashwin, Ravindra jadeja

Mahendra Singh Dhoni during the last four years has depended on Ravichandran Ashwin and Ravindra Jadeja for performing the spinners’ duties and is satisfied

స్పిన్నర్ ద్వయంపై సంతృప్తి వ్యక్తం చేసిన ధోని

Posted: 06/17/2015 08:42 PM IST
Ms dhoni satisfied with spin duo s progress

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జట్టు గెలుపులో కీలకంగా మారిన స్పినర్లపై ఆయన ప్రశంసలు కురిపించారు. కాగా గత నాలుగేళ్ల నుంచి జట్టు గెలుపులో క్రీయాశీలకంగా మారిన స్పిన్నర్ల ధ్వయంపై ఆయన పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశాడు. వారిలో ఒకరు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కాగా, మరోకరు ఎడమ చేతి వాటం గల స్పిన్నర్ రవీంద్ర జడేజా. బంగ్లాదేశ్ తో జరుగుతున్న రేపు జరగనున్న తొలి వన్డే మ్యాచ్ సందర్భంగా ఆయన మిర్పూర్ లోని షేరే బంగ్లా స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. జట్టులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ అశ్విన్ ఎంతో మెరుగయ్యాడని తెలిపారు. భిన్న పరిస్థితుల నేపథ్యంలోనూ బాగా రాణించి జట్టు గెలుపుకు కీలకంంగా మారుతున్నారని కితాబిచ్చాడు.

ఆటకు మెరుగులు దిద్దుకోవడం ఓ టెస్టు క్రికెటర్ కు ఎంతో అవసరమని ధోని అభిప్రాయపడ్డారు. అశ్విన్ ఆటకు గురించి బాగా అలోచిస్తాడని, అందుకే బౌలింగ్ ను విశేషంగా మెరుగుపర్చుకో గలిగాడని వివరించాడు. ఇక రవీంద్ర జడేజా గురించి ఆయన మాట్లాడుతూ భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత అత్మవిశ్వాసంతో ఉరకలేస్తున్నాడని చెప్పాడు. ఐపిఎల్ లో చక్కగా రాణించాడని, వరల్డ్ కప్ లోనూ చక్కగా రాణించి మెరుగైన ఆట తీరును కనబర్చాడని.. బంగ్లా సీరిస్ లో రెట్టించి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తాడని తాను భావిస్తున్నట్లు ధోని చెప్పాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : teamindia  bangladesh  MS dhoni  Ravichandran Ashwin  Ravindra jadeja  

Other Articles