Shahrukh khan | ED | bollywood news

Enforcement directorate summons shah rukh khan over forex violation

shahrukh khan news, shahrukh khan controversy, shahrukh khan ipl team, shahrukh khan kolkata team, shahrukh khan ED news, ED summons shahrukh khan, bollywood news, cricket updates

Shahrukh Khan Enforcement Directorate summons over forex violation : In a recent development, Bollywood actor Shah Rukh Khan has found himself in trouble again as Enforcement Directorate has summoned him over forex violation after ED found Kolkata Knight Riders (KKR) team shares undervalued

షారుఖ్ కు షాక్.. ఈడీ నోటీసులు..

Posted: 05/13/2015 11:02 AM IST
Enforcement directorate summons shah rukh khan over forex violation

బాలీవుడ్ బాద్ ‘షా’రుఖ్ ఖాన్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. క్రికెట్ సంబంధిత వ్యవహారాల నేపథ్యంలో ఆయనపై విదేశీ మారక ఉల్లంఘన ఆరోపణలు వున్నట్లు ఈడీ వెల్లడించింది. దీంతో అతనికి నోటీసులు జారీ చేసినట్లుగా ఈడీ తెలిపింది. సినీపరిశ్రమకు చెందిన షారుఖ్ కు క్రికెట్ తో సంబంధం ఏంటి? అని అనుకుంటున్నారా! ఇంతకీ ఈడీ ఏ విషయంలో నోటీసులు జారీ చేసింది? అని సందేహంలో మునిగిరా? ఆ వ్యవహారాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటికీ నుంచి క్రికెట్ కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుకు షారుఖ్ యజమానిగా కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే! గత ఏడు సీజన్లలో ఈ జట్టుకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోని ఆయన.. ఎనిమిదో సీజన్ లో మాత్రం అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుపోయారు. ఆ జట్టు ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయని.. అందుకే అతనికి నోటీసులు జారీ చేసినట్లుగా ఈడీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా తనపై జారీ అయిన నోటీసులకు షారుఖ్ సమాధానం చెప్పాలని కోరినట్లు ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahrukh khan  ED  bollywood news  

Other Articles