Twitter reacts on MS Dhoni gets angry with Ravindra Jadeja

Twitter reacts after csk captain ms dhoni gets angry with ravindra jadeja

ms dhoni, chennai super kings, ravindra jadeja, rajasthan royals, chennai, ma chidambaram stadium, want to enter playoffs as no 1 team fleming, rajasthan royals, Chennai Super Kings, Stephen Fleming, Delhi Daredevils, Chennai Super Kings, IPL 8, Cricket Chennai Super Kings Look to Strengthen Top Spot, latest IPL 8 news, Play-offs, IPL 8, IPL 2015, IPL, cricket news

Chennai Super Kings (CSK) captain MS Dhoni has always shown a cool demeanour on a cricket field. But last night at the MA Chidambaram Stadium, it was different

కూల్ కెప్టన్ కోపంపై ట్విట్టర్ జనుల రియాక్షన్

Posted: 05/11/2015 05:32 PM IST
Twitter reacts after csk captain ms dhoni gets angry with ravindra jadeja

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తారు. కానీ ఆదివారం రాత్రి ఎమ్ఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కాస్తంత భిన్నంగా కనిపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)8వ ఎడిషన్‌లో భాగంగా ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్ధాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్‌లో రాజస్ధాన్ రాయల్స్ జట్టు 27 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సందర్భంలో ఫైనల్ ఓవర్‌ను 'కెప్టెన్ కూల్' ధోని.... డ్వేన్ బ్రేవోని వేయమని కోరాడు.

దీంతో డ్వేన్ బ్రేవో వేసిన తొలి బంతిని రాజస్ధాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ క్రిస్ మెర్రిస్ సిక్స్‌గా మలిచాడు. అంతే కాదు పుల్ టాస్ బంతి కావడంతో అంఫైర్ దీనిని నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో తొలి బంతికే రాజస్ధాన్‌కు ఏడు పరుగుల లభించాయి. డ్వేన్ బ్రేవో వేసిన రెండో బంతిని క్రిస్ మెర్రిస్ డీప్ మిడ్ వికెట్ వైపు బాదాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా ఆ బంతిని కీపర్ ధోనికి విసిరాడు. ఈ క్రమంలో రాజస్ధాన్ బ్యాట్స్‌మెన్లు అంకిత్ శర్మ, క్రిస్ మెర్రిస్ రెండు పరుగులు తీశారు.

dhoni-jadeja-twitter

ఒక పరుగు లభించాల్సిన చోటు రవీంద్ర జడేజా అలసత్వం కారణంగా రెండు పరుగులు లభించడంతో ధోని కాస్తంత కోపోద్రిక్తుడయ్యాడు. ఆ సమయంలో కామెంటేటరీ చెబుతున్న మాజీ టీమిండియా బ్యాట్స్‌మెన్ అరుణ్ లాల్, ధోని చూపులు జడేజాని చంపే విధంగా ఉన్నాయని, అవసరమైతే ఖననం కూడా చేస్తాయని వ్యాఖ్యానించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఒక్క రవీంద్ర జడేజానే కాదు, ఎక్కువ మంది చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు క్యాచ్‌లను వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ లాంటివి చాలానే చేశారు. ఏదైతేనేం మ్యాచ్ చివరకు చెన్నై జట్టే, రాజస్ధాన్‌పై 12 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌కు మరోసారి తిరుగులేదని నిరూపించింది. 16 పాయంట్లతో పట్టికలో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai Super Kings  MS DHONI  Twitter  IPL 8  cricket news  

Other Articles