chennai super kings enters to play off | rajasthan royals team

Chennai super kings enters play off rajasthan royals team

chennai super kings, rajasthan royals, play off, ipl 8 season, mahendra singh dhoni, ravindra jadeja, mohit sharma, ajinkya rahane, shane watson

chennai super kings enters play off rajasthan royals team : chennai super kings won the match against rajasthan royals team in chepak stadium.

జడేజా మ్యాజిక్ తో ‘ప్లేఆఫ్’కి దూసుకెళ్లిన చెన్నై

Posted: 05/11/2015 11:32 AM IST
Chennai super kings enters play off rajasthan royals team

ఐపీఎల్-8 సిరీస్ లో ధోనీ సేన జైత్రయాత్ర కొనసాగిస్తూ దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఈ లీగ్ దశలో 12 మ్యాచులు ఆడిన చెన్నై జట్టు.. 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు.. సొంతగడ్డపై తమకు తిరుగులేదని ఈ జట్టు మరోసారి నిరూపించుకుంది. ఇక చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచులో రాజస్థాన్ జట్టును ఓడించి.. చెన్నై ప్లే ఆఫ్ కు దూసుకెళ్లింది.

వివరాల్లోకి వెళ్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. మొదట రాజస్థాన్ బౌలర్లు చెన్నై బ్యాట్స్ మెన్లను బాగానే కట్టడి చేశారు కానీ.. ఆ తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మెన్ బ్రెండన్ మెకల్లమ్ (81), డు ప్లెసిస్ (29) ఇద్దరూ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇక చివర్లో ధోనీ (13), డ్వేన్ బ్రావో (15) తమదైన రీతిలో బాదేశారు. దీంతో చెన్నై జట్టు 157 పరుగులను సాధించగలిగింది.

ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. టాప్ స్కోరర్ గా కొనసాగుతున్న రహానే (23), వాట్సన్ (28) పేలవ పెర్ఫార్మెన్స్ తో పవేలియన్ చేరడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ఇక ఆల్ రౌండర్ జడేజా తన బంతితో మ్యాజిక్ చేయడంతో ఈ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 4 ఓవర్లలో11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

ఇక జడేజాతోపాటు మోహత్ శర్మ (3/25) కూడా తన బౌలింగ్ ప్రతిభను ప్రదర్శించడంతోపాటు రాయల్స్ ఆటగాళ్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. చివర్లో శామ్సన్ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫాల్క్‌నర్ (13 బంతుల్లో 16; 2 ఫోర్లు)లు ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేపారు. కానీ.. చెన్నై బౌలర్ల ధాటిముందు నిలబడలేకపోయారు. దీంతో రాయల్స్ జట్టు చెన్నై ముందు తోకముడవక తప్పలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chennai super kings  rajasthan royals  ipl 8 season  

Other Articles