Anushka Sharma reveals the love she shares with beautiful Virat Kohli

Virat and i love each other for both the real and right reasons

ipl 2015, cricket, bangalore royal chanllangers, Criticism, Middle-class family, anushka, kohli, Indian Premier League team, Virat Kohli, raju hirani, Bombay velvet, Anushka Sharma

It took some time for Anushka Sharma and Virat Kohli to come out in the open about their relationship.

విరాట్ మాటలకే ప్రాధాన్యం, మిగతా వాళ్లు..

Posted: 05/09/2015 03:15 PM IST
Virat and i love each other for both the real and right reasons

ప్రేమలో పడిన జంట.. మామూలు జంట కాదండీ.. ఒకరేమే టిమిండియా వైస్ కెప్టెన్, టెస్టు క్రికెట్ కెప్టెన్, మరోకరు ఏకంగా బాలీవుడ్ స్ర్కీన్ పైన మాత్రమే కనబడే అందాల ముద్దుగుమ్మ. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. మాకు తెలుసు విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ అని అంటున్నారు కదూ.. అవును. వాళ్లు ప్రేమలో పడి చాలా కాలమే అయినా.. ఇప్పటి వరకు ఒకరి గురించి మరోకరు పెదవి విఫ్పలేదు. కొందరైతే వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందన్నారు. మరికోందరు నిశ్చితార్థం కూడా జరిగిందన్నారు. ఇంకోందరు ఇంకేవేవో అన్నారు.

అయితే ఇన్నాళ్ల పాటు వీళ్లిద్దరు ఎక్కడ కనబడినా.. ప్రేమ గురించి అడగటమే హాట్ క్వాశ్వన్ గా మారింది మీడియా.. అదేంటో కాని ప్రపంచ కప్ క్రికెట్ టార్నోమెంటులో సెమీఫైన్సల్ లో ఇండియా ఓడిపోగానే.. వీరిద్దరిపై వచ్చినన్ని విమర్శలు మరెవరిపైనా రాలేదు. వాటన్నింటికీ భారత్ చేరిన వెంటనే తన ప్రేయసి చేయిని పట్టుకున్న విరాట్.. ఒక విధంగా బాడీ గార్డు తరహాలో అమెను విమానాశ్రయం నుంచి బయటకు తీసుకోచ్చారు. అంతేకాదు.. ఇద్దరూ కలసి ఒకే కారులో వెళ్లారు. తన చర్యలే సామాజిక మాధ్యమంలో వచ్చిన విమర్శలకు సమాధానంగా అన్వయించుకోవాలని అతని సన్నిహితులు కూడా అన్నారు. ఇది జరిగిన తరువాత ఇన్నాళ్లకు అందాలరాశి అనుష్క శర్మ తమ ప్రేమాయణంపై పెదవి విప్పింది.

తనుకు తన ప్రియుడికి మధ్య ప్రేమ బంధం విమర్శలతో మరింత బలపడిందని అసలు విషయాన్ని చెప్పిందీ ముద్దుగుమ్మ. తాను స్వతహాగా ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయినని. అందుకే అందరికన్నా కొంచెం ధైర్యం ఎక్కువని చెప్పింది. ఏ విషయానికీ భయపడకూదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఢీ కొట్టడానికి రెడీగా ఉండాలని మా నాన్నగారు ఎప్పుడూ తనకు చెబుతుంటారని చెప్పింది. అందుకే, మొన్న విరాట్ కోహ్లీ సరిగ్గా మ్యాచ్ ఆడకపోతే తనను సామాజిక మాద్యమం ద్వారా దోషిని చేసి నెట్ జనులు నిందించినా తాను నిబ్బరంగా ఉండగలిగని చెప్పింది. విరాట్ మ్యాచ్ అడే విషయంలో అసలు తనకు ఎందుకు నిందించారో.. ఏ మాత్రం సంబంధం లేకుండానే తానెందుకు నిందలపాలు కావాల్సి వచ్చిందో తనకే అర్థంకాలేదని తెలిపారు.

తప్పు చేయని విషయాలకు తానెందుకు బాధపడాలి? నిన్న మొన్నటివరకూ తాను బయటివాళ్ల మాటలకు ప్రాధాన్యం ఇచ్చేదాన్నని.. తన గురించి ఎవరేమనుకుంటారోనని కంగారుపడేదాన్ని. కానీ, ఇప్పుడు అల్లాక్కాదని తేల్చి చెబుతుంది అమ్మడు. అమ్మ, నాన్న, సోదరుడితో పాటు విరాట్ కోహ్లీ మాటలకు మాత్రమే తాను ప్రాధాన్యం ఇస్తాను. మిగతా వాళ్ల మాటలు తనకు అనవసరమని ఖచ్చితంగా చెబుతోంది. ఆ నలుగురే తన జీవితమంటోంది. విరాట్ తన జీవితానికి చాలా ముఖ్యమని.. తమ ఇద్దరి గురించీ అందరికీ తెలియని విషయం ఏంటంటే.. తమ అభిప్రాయాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయని చెబుతోంది.. అలాగే, మా ఇద్దరికీ ఇంకా చాలా విషయాల్లో పోలికలున్నాయని.. ఇద్దరం మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చిన వాళ్లమేనని కూడా చెబుతోంది. ఎవరి అండదండలూ లేకుండా స్వశక్తితో పైకొచ్చినవాళ్లేనట. తమ గురించి వచ్చిన విమర్శలు వారి అనుబంధాన్ని ఇంకా పటిష్టం చేశాయని కూడా అంటోంది ఈ అందాల అనుష్క. మరి దీనికి విరాట్ ఏలా స్పందిస్తారో వేచిచూడాలి మరి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2015  cricket  bangalore royal chanllangers  anushka  virat kohli  

Other Articles