Hyderabad Uppal Rajiv Gandhi stadium posses seize threat from UIDLA

Uidla to sieze uppal stadium

UIDLA to sieze Uppal stadium, Uppal Rajiv Gandhi stadium posses seize threat, Uppal Rajiv Gandhi stadium, IPL 8, Cricket IPL 8, Cricket, uppal Stadium Siege, Hyderabad Cricket Association, Uppal Industrial Area Local Authority, Sunrisers Hyderabad latest IPL 8 news

Uppal Industrial Area Local Authority warns rajiv gandhi stadium authorities to pay tax, if not they will sieze tha staduim

ఉప్పల్ స్టేడియం సీజ్ చేస్తాం.. ఐలా హెచ్చరికలు

Posted: 05/09/2015 01:43 PM IST
Uidla to sieze uppal stadium

ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియానికి సీజ్ ప్రమాదం పోంచి వుంది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అయితే ఇలాంటి హెచ్చరికలు రావడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ అనేక పర్యాయాలు ఇలాంటి హెచ్చరికలు జారీ అయినా.. ఈ సారి మాత్రం చాలా పకడ్భంధీగానే హెచ్చరికలు జారీ కావడంతో.. హెచ్ సీ ఎ అధికారులు ఈ తటపటాయిస్తున్నారు. అయితే ఈ హెచ్చరికలు జారీ చేసిందెవరు..? వారికి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియానికి సంబంధమేమిటి అన్న ప్రశ్నలు కూడా ఇక్కడ ఉదయించకమానవు.

ఇళ్లు, భవనాలకు చెందిన ఆస్తి పన్నులు చెల్లించని పక్షంలో నోటీసులు జారీ చేసే అధికారులు.. మౌలిక వసుతులను కట్ చేసి మరీ పన్నును వసూలు చేస్తుంటారు. కానీ సుదీర్ఘ కాలంగా ఆస్తి పన్ను చెల్లించకుండా ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఇన్నాళ్లు మీన మేషాలు లెక్కించిన ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) అధికారులు.. ఐపీఎల్ మ్యాచుల నేపథ్యంలో ఎలాగైనా వసూలు చేయాలని గట్టి చర్యలకు సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు వున్న నేపథ్యంలో.. శనివారం బాకీ చెల్లించని పక్షంలో సాయంత్రం స్టేడియాన్ని సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తు ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే హెచ్‌సీఏ తమకు రూ. 12 కోట్ల భారీ మొత్తంలో ఆస్తి పన్ను బాకీ ఉందని.. ఈ నేపథ్యంలోనే తమకు మరో గత్యంతరం లేక ఇలా చేస్తున్నామని ‘ఐలా’ వెల్లడించింది.

పన్ను చెల్లించకుండా హెచ్‌సీఏ తాత్సారం చేస్తోందని అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 10, 15, 17 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గత శనివారం తొలి మ్యాచ్‌కు ముందే ‘ఐలా’ స్టేడియం సీజ్ చేసేందుకు యత్నించగా, హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌తో చర్చల అనంతరం మరికొంత గడువు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. శనివారం మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే స్టేడియంను సీజ్ చేస్తామని ‘ఐలా’ ప్రతినిధులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, ఐలా అధికారులు స్టేడియం వద్దకు చేరుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles