Rohit Sharma gets engaged to best friend Ritika, tweets picture

Rohit sharma got engaged to ritika sajdeh

rohit sharma gets engaged, twitter, picture, Cricketer Rohit Sharma, best friend, Ritika. Tweets picture, From best friends to soulmates, Cricket, IPL 8, Rohit Sharma, Team India, IPL 8 MI, relationship, India opening batsman and Mumbai Indian captain, Cuffe Parade girl Ritika Sajdeh, Ritika Sajdeh

Cricketer Rohit Sharma has got engaged to his best friend Ritika. Tweeting out a picture with her on Sunday, the 28-year-old cricketer said, "From best friends to soulmates, couldn't get any better".

బాల్యస్నేహితురాలినే భార్యను చేసుకుంటున్నాడు..

Posted: 05/03/2015 03:57 PM IST
Rohit sharma got engaged to ritika sajdeh

భారత యువ క్రికెటర్లు ఒక్కొక్కరూ ఓ ఇంటివారుగా మారుతున్నారు. ప్రపంచ కప్ ముగించుకుని భారత్ చేరుకున్న వెంటనే.. ఐపీఎల్ కు కేవలం రెండు రోజుల ముందు సురేశ్ రైనా వివాహం చేసుకుని ఇంటివాడు అవ్వగా ఇప్పుడు ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. త్వరలో క్రీడాకారులుకు లభించి అత్త్యుత్తమ పురస్కారం అర్జునా అవార్డును అందుకోబోతున్న ( ప్రస్తుతం బిసిసిఐ క్రీడా మంత్రిత్వ శాఖకు ఈ మేరకు ప్రతిపాదన పంపింది.. కానీ ఇంకా ఖరారు కాలేదు) ఆయన.. ఆ వేడుకకు తన సతీమణిని తీసుకెళ్లే ప్లాన్ లో వున్నాడు.

అయితే గత ఆరు నెలలుగా ముంబాయి బుల్లోడు ప్రేమాయణం నడుపుతున్నా ఎక్కడా లీక్ కాలేదు. తాజాగా స్వయంగా రోహిత్ శర్మ తనకు కాబోయే సతీమణి రితికా సాజ్దే అంటూ ఇద్దరు కలసి దిగిన సెల్పీలను ట్టిట్టర్లో పోస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. అయితే ఇంతకీ రితికా సాజ్దే ఎవరు అంటూ ఆరాలు తీయకండీ.. ఎందుకంటే అమె మరెవరో కాదు.. రోహిత్ శర్మ చిన్ననాటి స్నేహితురాలేనట. గత ఆరు సంవత్సరాలుగా వీరిద్దరు చాలా చనువుగా ఉంటున్నారని తెలుస్తోంది. చిన్నప్పుటి నుంచి కలిసి తిరిగిన వీరిద్దరి మధ్య అప్యాయాతానురాగాలకు కొదవేలేదంట. బెస్ట్ ఫ్రెండే.. సోల్ మేట్గా మారుతున్న సమయంలో రోహిత్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడట. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుంది. ట్విట్టర్లో అర్ధాంగి ఫొటోను పోస్ట్ చేసిన క్షణాల్లోనే అభిమానులు కంగ్రాట్స్ రోహిత్ అంటూ భారీగా స్పందించారు. మనమూ కంగ్రాట్స్ చెబుదాం మరి.. !

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rohit sharma  ritika sajdeh  engaged  IPL 8  Team India  

Other Articles