Rajeev Shukla may become IPL chairman again

Rajeev shuklas hat too in ipl ring

Rajeev Shukla may become IPL chairman again, IPL chairman, Rajeev shukla replaces Ranjib biswal, Ranjib Biswal, former Indian captain Sourav Ganguly, rajeev shukla, BCCI president Jagmohan Dalmiya, former BCCI chief N Srinivasan, Sharad Pawar, Ajay Shirke. IPL season 8, Indian cricket board (BCCI)

The formal verdict is yet to be out, but Rajeev Shukla has emerged as the front-runner for the post of IPL chairman. According to sources, the Indian cricket board (BCCI) bosses decided on Shukla after a three-horse race failed to produce a clear winner.

ఐపీఎల్ చైర్మన్ గా రాజీవ్ శుక్లా.. అధికారికంగా వెల్లడించనున్న బీసీసీఐ

Posted: 04/06/2015 11:18 AM IST
Rajeev shuklas hat too in ipl ring

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ పీఠం మరోమారు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లాను వరించనుంది. ఈ పదవిని ఆశిస్తున్నవారిలో రాజీవ్ శుక్లా ముందువరుసలో కొనసాగుతున్నారు. ఈ మేరకు బీసీసీఐ త్వరలోనే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ పదవి కోసం పోటీ పడిన ముగ్గురు ఎవరూ.. స్పష్టమైన అధిక్యత కనబర్చకపోవడంతో.. రాజీవ్ శుక్లాను ఈ పదవికి ఎంపిక చేసేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. రాజీవ్ శుక్లా తదుపరి ఐపీఎల్ చైర్మన్ అని బీసీసీఐ కార్యవర్గ సభ్యుడు తెలిపారు. ప్రస్తుతం ఈ పదవిలో కోనసాగుతున్న రంజీబ్ బిస్వాల్ ను పక్కకు జరిపి రాజీవ్ శుక్తా ఈ స్థానాన్ని అక్రమించనున్నారు.

గత నెలలో ఐపీఎల్ కోశాధికారి పదవికి పోటీ చేసిన రాజీవ్ శుక్లా శ్రీనివాసన్ మద్దతుదారు అనిరుధ్ చౌధురి చేతిలో ఓడిపోయారు. దాంతో ఇప్పుడు ఐపీఎల్ అధ్యక్ష పీఠంపై కన్నేశారు. ఈ పదవికి బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా మద్దతు కలిగిన టీమిండియా మాజీ కెప్టన్ సౌరవ్ గంగూలీ, మాజీ బిసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ మద్దతు కలిగిన  రంజీబ్ బిస్వాల్, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ మద్దత్తుతో అజయ్ షిర్కే ఈ పదవికి పోటీ పడ్డారు. అయితే ఈ ముగ్గురు.. తమ అధిక్యతను స్పష్టంగా చూపిడంలో విఫలమయ్యారు. దీంతో అవకాశం రాజీవ్ శుక్లాను వరించనునందని తెలిసింది. 2013లో టోర్నమెంట్ లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో రాజీవ్ శుక్లా ఐపీఎల్ చైర్మన్ గా కొనసాగారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajeev Shukla  IPL chairman post  Indian cricket board (BCCI)  

Other Articles