Sunil Narine's Bowling Action Cleared by BCCI

Narines action cleared by the bcci

narines action cleared by the bcci, Sunil Narine's Bowling Action Cleared by BCCI, Kolkata Knight Riders, IPL season 8, Indian Premier League., Sunil Narine's Bowling Action in chennai

BCCI has cleared Sunil Narine to play for Kolkata Knight Riders in this year's Indian Premier League.

కోల్ కత్తా నైట్ రైడర్స్ కు గుడ్ న్యూస్,, నరేన్ కు గ్రీన్ సిగ్నల్

Posted: 04/05/2015 08:04 PM IST
Narines action cleared by the bcci

మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనమిదవ సీజణ్ ప్రారంభం వేడుకలకు ముహూర్తం సమీపంచనున్న నేపథ్యంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు శుభవార్త అందింది. ఈ ఎడిషన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్‌ విభాగంలో మరింతగా బలపడింది. బీసీసీఐ వెస్టిండిస్ స్పిన్ దిగ్గజం సునీల్ నరేన్‌కు చెన్నైలో నిర్వహించిన బౌలింగ్ పరీక్షలో గ్రీన్ సిగ్నిల్ లభించింది. సునీల్ నరేన్ బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బౌలింగ్ కమిటీ, నరేన్ బౌలింగ్ యాక్షన్‌పై చెన్నైలోని శ్రీ రామచంద్ర యూనివర్సిటీలో గురువారం పరీక్షలు నిర్వహించి, ఆ నివేదికను బీసీసీఐకి సమర్పించింది.

బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఆదివారం నాడు ఈ నివేదికపై మాట్లాడుతూ సునీల్ నరేన్ బౌలింగ్ యాక్షన్‌కు గ్రీన్ సిగ్నిల్ వచ్చిందని, నరేన్ బౌలింగ్‌ను ఐపీఎల్‌లో చూడబోతన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ ఆరోపణలతో గత ఏడాది ఆగస్టు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు సునీల్ నరేన్ దూరమయ్యారు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014లో టైటిల్ ఛాంపియన్స్‌గా నిలవడంలో సునీల్ నరేన్ కీలకపాత్ర పోషించాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  bcci  sunil narine  kolkata knight riders  ipl 8  chennai  

Other Articles