Michael Clarke and Dan vettori retires from cricket | cricket

Michael clarke and dan vettori retires from cricket

michael clarke, New zealand vs Australia, New zealand versus Australia final, ICC Cricket World Cup 2015 final match, world cup final live updates, cricket world cup final scores, icc cricket world cup finals, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, New zealand, New zealand CWC 2015, Sports, World Cup Live, Dan vettori

Australian captain Michael Clarke and New Zealand player Dan vettori retires from cricket

క్రికెట్ నుంచి వెటోరి.. వన్డేల నుంచి క్లార్క్ రిటైర్..

Posted: 03/29/2015 06:57 PM IST
Michael clarke and dan vettori retires from cricket

అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచానికి మరో ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు వీడ్కోలు పలికారు. ప్రపంచకప్ గెలుపోంది చిరస్మరణీయ జ్ఞాపకాలతో ఒకరు విడ్కోలు పలుకుతుండగా, ఓటమిని చవిచూసి మరో దిగ్గజం గుడ్ బై చెబుతున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ వన్డేల నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఒక్క రోజు ముందు తీసుకున్నాడు. కాగా,  న్యూజిలాండ్ అల్ రౌండర్ డానియల్ వెట్టోరి అంతర్జాతీయ క్రికెట్కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించారు.

రిటైర్మెంట్ నిర్ణయం ముందే ప్రకటించిన వెట్టోరి, క్లార్క్కు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరిది. కాగా క్లార్క్ టెస్టుల్లో కొనసాగనున్నాడు. 18 ఏళ్లపాటు న్యూజిలాండ్ క్రికెట్కు సేవలందించిన 36 ఏళ్ల వెట్టోరి అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. 18 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వెట్టోరి కెప్టెన్గా, ఆల్రౌండర్గా విశేష సేవలందించాడు. 113 టెస్టులాడిన వెట్టోరి 4531 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 23 అర్ధ శతకాలున్నాయి. టెస్టుల్లో 362 వికెట్లు పడగొట్టాడు. ఇక 295 వన్డేలాడిన కివీస్ మాజీ కెప్టెన్ 2251 పరుగులు చేశాడు. కాగా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. 4 హాఫ్ సెంచరీలు చేయగా, 305 వికెట్లు తీశాడు. 34 టీ-20లు ఆడిన వెట్టోరి 205 పరుగులు చేసి, 38 వికెట్లు పడగొట్టాడు.

ఆసీస్ కెప్టెన్, 34 ఏళ్ల క్లార్క్ 12 ఏళ్ల క్రితం వన్డేల్లో అరంగేట్రం చేశాడు. క్లార్క్ తన కెరీర్లో 245 వన్డేలు ఆడాడు. 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలతో 7981 పరుగులు సాధించాడు. 108 టెస్టులాడిన క్లార్క్ 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 8432 పరుగులు చేశాడు. దిగ్గాజాల నిష్ర్కమణ: ప్రపంచ కప్లో చాలా మంది దిగ్గజాలు వీడ్కోలు పలికారు. శ్రీలంక వెటరన్లు కుమార్ సంగక్కర, మహేల జయవర్దనె..  పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా, మాజీ కెప్టెన్ అఫ్రీది.. జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ రిటైరయిన సంగతి తెలిసిందే. తాజాగా వెట్టోరి, క్లార్క్ వైదొలిగారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  New zealand  Australia  michael clarke  Dan vettori  retirement  

Other Articles