Suresh raina to marry priyanka chaudhary after worldcup tournament

suresh raina news, suresh raina marriage news, suresh raina cricket career, suresh raina priyanka choudhury, priyanka choudhury updates, suresh raina marriage updates, suresh raina bride priyanka, suresh raina family members

suresh raina to marry priyanka chaudhary after worldcup tournament : Indian energetic batsman suresh raina to tie knot with priyanka choudhury who is doing as banker in netherlands. Their family members are best friends before days.

త్వరలోనే ప్రియాంకను పెళ్లి చేసుకోబోతున్న రైనా..

Posted: 03/17/2015 11:35 AM IST
Suresh raina to marry priyanka chaudhary after worldcup tournament

ప్రపంచకప్-2015 టోర్నమెంట్ లో భాగంగా ఫుల్ జోష్ మీదున్న ఇండియన్ ఎనర్జిటిక్ బ్యాట్స్ మన్ సురేష్ రైనా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన ప్రియాంక చౌదరిని ఇతగాడు వివాహమాడనున్నట్లు సమాచారం! ఇప్పటికే ఇరువురి కుటుంబసభ్యులు వీరిద్దరి పెళ్లిని ఫిక్స్ చేసేశారు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 3వ తేదీన ఢిల్లీలో చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరుగుతుంది. మీరట్  సమీపంలోని బారుట్‌కు చెందిన ప్రియాంక.. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో బ్యాంకర్‌గా పని చేస్తోంది.

ఇంకో విషయం ఏమిటంటే.. వీరిద్దరి కుటుంబాలకు సుదీర్ఘకాలం నుంచి మంచి సాన్నిహిత్యమే వుంది. ఇద్దరి తండ్రులు మురాద్‌నగర్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో కలిసి పని చేశారు కూడా! ఇప్పుడు ఆ సాన్నిహిత్యమే బంధంగా మారనుంది. ఈ నెల 12వ తేదీన పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయ ‘రోకా’ వేడుకను కూడా ముందుగానే జరిపించేశారు. ఈ కార్యక్రమం అనంతరం రైనా కుటుంబసభ్యులు పెళ్లి విషయాన్ని ధ్రువీకరించారు. ఏప్రిల్ 3వ తేదీన పెళ్లి ముగిసిన అనంతరం 8వ తేదీన రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇదిలావుండగా.. గతంలో రైనా పెళ్లికి సంబంధించి ఎన్నోరకాల రూమర్లు వెలువడ్డాయి. ఇతగాడు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ హీరోయిన్ తో రహస్యంగా ప్రేమాయణం నడుపుతున్నాడని, ఆమెతోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే.. అవన్నీ రూమర్లేనంటూ రైనా అప్పట్లో కొట్టిపారేసినప్పటికీ అవి అలాగే కొనసాగాయి. అయితే.. ఇప్పుడీ పెళ్లి విషయంతో వాటికి ఫుల్ స్టాప్ పడినట్లే లెక్క!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suresh raina marriage  priyanka choudhury  icc worldcup 2015 updates  

Other Articles