India vs bangladesh quarter final worldcup match umpire aleem dar

india vs bangladesh match, aleem dar news, umpire aleem dar news, icc world cup 2015, india world cup tournament, bangladesh worldcup tournament, indian cricket team members, pakistan cricket team members

india vs bangladesh quarter final worldcup match umpire aleem dar : Icc selected Pakistan umpire aleem dar for india vs bangladesh quater final match in world cup 2015.

వరల్డ్ కప్ లో భారత్ మ్యాచ్ కు పాకిస్థానీ అంపైర్

Posted: 03/17/2015 12:34 PM IST
India vs bangladesh quarter final worldcup match umpire aleem dar

దాయాది దేశాలైన ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య పోరు ఎంత ఆసక్తికరంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండుజట్ల జరిగే మధ్య పోరుకి కేవలం భారత్, పాక్ దేశస్థులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వుండే క్రికెట్ అభిమానులంతా వీక్షిస్తారు. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో ఈ రెండు జట్ల మధ్య పోరు కేవలం ఒకసారి మాత్రమే జరిగింది. ఆ తర్వాత ఆ అవకాశమే రాలేదు. అయితే.. భారత్ జట్టు పాల్గొనే క్వార్టర్ ఫైనల్ ఓ పాకిస్థానీ అంపైర్ గా ఖరారు కావడం ఆసక్తిగా మారింది.

ప్రపంచకప్ టోర్నమెంట్ ప్రస్తుతం లీగ్ దశ నుంచి దాటి క్వార్టర్ ఫైనల్ కు తెరలేస్తోంది. ఇప్పటికే ఐసీసీ మొత్తం నాలుగు మ్యాచులకు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రకటించింది. అందులో భాగంగా శనివారం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో భారత్ జట్టు బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఇందుకోసం ఇరుజట్లు మెలో బోర్న్ చేరుకున్నాయి. కూడా! ఈ మ్యాచ్ కు అంపైర్లుగా వ్యవహరించేవారిని కూడా ఐసీసీ ఖరారు చేసింది. ఇద్దరి అంపైర్లలో ఒకరు ఇంగ్లాండ్ కు చెందిన ఇయాన్ గౌల్డ్ కాగా.. మరొకరు పాకిస్థాన్ కు చెందిన అలీమ్ దార్!

అంపైరింగ్ లో విశేష అనుభవమున్న అలీమ్ దార్.. ఇదివరకే భారత్ ఆడిన మ్యాచులకు అంపైర్ గా వ్యవహరించారు కూడా! అయితే.. ఈ వరల్డ్ కప్ లో భారత్ మ్యాచ్ కు ఆయన ఎంపిక కావడం కాస్త ఆసక్తిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : umpire aleem dar  india vs banlgadesh quarter final  icc worldcup 2015  

Other Articles