Jason holder speaks about chris gayle fitness

Jason Holder, west indies cricket team, chris gayle news, new zealand cricket team, icc world cup 2015, west indies vs new zealand team, india vs bangladesh team, pakistan vs australia team, srilanka vs south africa team, world cup quarter final match

Jason Holder speaks about chris gayle fitness : West indies captain jason holder speaks about chris gayle fitness that he will play well against new zealand team in quarter final match.

కివీస్ పై గేల్ దుమ్ములేపడం ఖాయం.. జోస్యం చెప్పిన కెప్టెన్

Posted: 03/16/2015 06:51 PM IST
Jason holder speaks about chris gayle fitness

ప్రపంచకప్ టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. పసికూన జట్లు ఇంతవరకు పెద్ద జట్లతో పోరాడి చివరికి ఇంటిదారి పట్టాయి. దీంతో ఇప్పుడు క్వార్టర్ ఫైనల్లో ఎనిమిది జట్లు పోరుకు సిద్ధంగా వున్నాయి. అందులో భాగంగా దక్షిణాఫ్రికాతో శ్రీలంక, బంగ్లాదేశ్ తో భారత్, ఆస్ట్రేలియాతో పాకిస్థాన్, న్యూజిలాండ్ తో వెస్టిండీస్ జట్లు ఈ క్వార్టర్స్ లో తలపడేందుకు సిద్ధంగా వున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు ఈ నాకౌట్ దశకోసం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. అన్ని జట్లు పెద్దవే కాబట్టి.. ఎవరు గెలుస్తారోనన్న ఆసక్తి నెలకొంది.

ఇదిలావుండగా.. కివీస్ తో పోరుకు సిద్ధమవుతున్న వెస్టిండీస్ జట్టులో విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ ఫిట్ నెస్ పై ఇంకా స్పష్టత రాలేదు. వీపు నొప్పి కారణంగా ఆదివారం యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్ కు గేల్ కు దూరంగా వున్నాడు. అది పసికూన జట్టు కాబట్టి ఆ మ్యాచ్ లో గేల్ లేని లోటు కనిపించలేదు. అయితే.. కివీస్ ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్ సిరీస్ లో వరుసగా గెలుచుకుంటూ సెకండ్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంది. దీంతో ఆ జట్టుతో తలపడాలంటే గేల్ లాంటి విధ్వంసక ఆటగాడు తమ జట్టుకు ఎంతో అవసరం. దీంతో అతని ఫిట్ నెస్ కోసం జట్టు ఆటగాళ్లు జపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే విండీస్ జట్టు కెప్టెన్ గేల్ తిరిగి కోలుకుంటాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. క్వార్టర్ ఫైనల్లో గేల్ కీలకమవుతాడని కెప్టెన్ జాసన్ హోల్డర్ అభిప్రాయపడ్డాడు. గేల్ పూర్తిగా కోలుకోకున్నా.. అతడు బరిలోకి దిగుతాడని అన్నాడు. కీలక మ్యాచ్ లలో కీలక ఆటగాళ్లు ఏం చేయగలరో తెలిసిన విషయమేనని అతడు పేర్కొన్నాడు. అలాగే.. గేల్ కోలుకుని కివీస్ తో పోరుకు సిద్ధమవుతాడని విండీస్ శిబిరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి.. వారు అనుకున్నట్లుగా గేల్ ఎలా ఆడతాడో వేచి చూడాలి. అన్నట్లు ఈ రెండుజట్ల మధ్య పోరు ఈనెల 21న వెల్లింగ్టన్ లో జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles